close
Choose your channels

మాలీవుడ్‌పై రామ్‌ ఫోకస్‌...

Sunday, January 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాలీవుడ్‌పై రామ్‌ ఫోకస్‌...

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెడ్‌'. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఐడెంటికల్‌ ట్విన్స్‌.. ఒకరంటే ఒకరికి పడదు, కొట్టుకుని చస్తుంటారు. కానీ ఇద్దరిలో ఎవరికైనా సమస్య అంటూ వస్తే ఒక్కటైపోతారు. అందరినీ కన్‌ఫ్యూజ్‌ చేసి బయటపడతారు. ఈ పాయింట్‌తో తెరకెక్కిన తడం చిత్రాన్ని తెలుగులో రెడ్‌ పేరుతో రీమేక్‌ చేశారు. ఇప్పుడు రామ్‌ ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.

ఈ సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఇది వరకే నిర్మాతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మలయాళ వెర్షన్‌ను విడుదలకు సిద్ధం చేశారు. మలయాళ రెడ్‌ టీజర్‌ను ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అనుపమ పరమేశ్వరన్‌ విడుదల చేస్తుంది. ఈ విషయాన్ని అనుపమ పరమేశ్వరన్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తే.. రామ్‌ అనుపమకు సెటైరికల్‌గా థాంక్స్‌ చెప్పాడు. ఎలాగో తెలుసా 'ఉప్మా పాప.. థాంక్యూ' అంటూ. ఇంతకీ రామ్‌, అనుపమని ఎందుకు ఉప్మా అని అన్నాడో తెలుసుగా. హలోగురు ప్రేమకోసమే సినిమాలో అనుపమ.. పేరుని అను ఉప్మ అంటూ సెటైరికల్‌గా చెప్పే డైలాగ్‌ ఉంటుంది. దాన్నే మరోసారి రామ్‌ గుర్తుకు తెచ్చుకున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.