close
Choose your channels

`రొమాంటిక్‌`లో `ఇస్మార్ట్ శంక‌ర్‌`.. కార‌ణ‌మ‌దేనా?

Thursday, December 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`రొమాంటిక్‌`లో `ఇస్మార్ట్ శంక‌ర్‌`.. కార‌ణ‌మ‌దేనా?

ఎనర్జిటిక్‌స్టార్ రామ్ హీరోగా ఈ ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్`తో సెన్సేష‌నల్ హిట్‌ను అందుకున్నాడు. రామ్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత పూరి జ‌గ‌న్నాథ్ కోసం హీరో రామ్ ఓ ప‌నిచేయ‌డానికి ఓకే అన్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కు త‌న‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన పూరి కోసం రామ్ ఏం చేయ‌బోతున్నాడో తెలుసా?..

వివ‌రాల్లోకెళ్తే, పూరి త‌నయుడు ఆకాశ్ పూరి హీరోగా రూపొందుతోన్న‌న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఆంధ్రాపోరి, మెహ‌బూబా చిత్రాల్లో హీరోగా న‌టించిన ఆకాశ్ పూరికి స‌రైన బ్రేక్ ద‌క్క‌లేదు. ఈ సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి హీరో రామ్ ఈ సినిమాలో ఓ పాట‌లో ఓ నిమిషం పాటు క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర యూనిట్ స్పందించ‌లేదు.

ఆకాష్ పూరి స‌ర‌స‌న కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.