ఏప్రిల్ 25 నుండి ఎనర్జిటిక్ స్టార్ రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,March 18 2017]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మాత‌గా కొత్త చిత్రం రూపొంద‌నుంది. గ‌తేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన నేను శైల‌జ ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది.

నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌, బాడీలాంగ్వేజ్‌తో చూపించ‌బోతున్నారు.రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నేను శైల‌జ చిత్రాన్ని అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా స్టార్ రైట‌ర్ సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.

More News

'ఉంగరాల రాంబాబు' షూటింగ్ పూర్తి

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు.

'చెలియా' ఆడియో రిలీజ్ ఎప్పుడంటే...

కార్తీ,అదితిరావు హీరో హీరోయిన్లుగా ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ 'చెలియా'.

బాహుబలి 2 రికార్డుల పరంపర...వర్మ కౌంటర్....

బాహుబలి...ఈ పేరుతో తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచానికి తెలియచెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

'కేశవ' టీజర్ డేట్

స్వామిరారా నుండి తన సక్సెస్ యాత్రను కొనసాగిస్తున్న నిఖిల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

'బాహుబలి 2' కి కలిసొచ్చిన జియో

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,అనుష్క,తమన్నా,సత్యరాజ్,నాజర్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న విజువల్ వండర్ బాహుబలి 2.