close
Choose your channels

సూపర్ డూపర్ అంటూ రామ్ ట్వీట్.. లింగుస్వామి మూవీ అప్డేట్!

Thursday, June 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ డూపర్ అంటూ రామ్ ట్వీట్.. లింగుస్వామి మూవీ అప్డేట్!

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై రామ్ అభిమానులకు అప్డేట్ అందించాడు.

'ఇప్పుడే ఫైనల్ నేరేషన్ పూర్తయింది.. ఎంత బాగా జరిగింది!!! లింగుస్వామి సర్ ఐ లవ్ యు. సూపర్ డూపర్ కిక్డ్ .. వెంటనే కెమెరా రోల్ చేసేయండి' అంటూ రామ్ ట్వీట్ చేశాడు. రామ్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే కథ అద్భుతంగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.

సూపర్ డూపర్ అంటూ రామ్ ట్వీట్.. లింగుస్వామి మూవీ అప్డేట్!

మాస్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో లింగుస్వామి స్టయిలే వేరు. ఇక పవర్ ఫుల్ రోల్ దొరికితే రామ్ చెలరేగిపోతాడు. దీనితో ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. రామ్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ క్రేజ్ ని అమాంతం పెంచేసింది. పందెం కోడి, ఆవారా లాంటి విజయవంతమైన చిత్రాలు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.