ఉగాది రోజు రామ్ కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,March 25 2017]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు. గ‌తేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన నేను శైల‌జ ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే.

ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌, బాడీలాంగ్వేజ్‌తో చూపించ‌బోతున్నారు. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 29న లాంచ‌నంగా ప్రారంభం కానుంది.

నేను శైల‌జ చిత్రాన్ని అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.

More News

ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న 'రక్షకభటుడు'

'రక్ష' ఓ సస్పెన్స్ హర్రర్... 'జక్కన్న' మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్... కేవలం రెండు చిత్రాలతోనే దర్శకుడుగా తన సత్తాని ప్రూవ్ చేసుకుని ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ప్రస్తుతం 'రక్షకభటుడు' వంటి డిఫరెంట్ టైటిల్తో ఫాంటసీ ధ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

'మయూరి' ద్వారా ఈనెల 31 'సినీమహల్' రిలజ్

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం `సినీ మహల్`. `రోజుకు 4 ఆటలు` అనేది ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వహించారు. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని నాయకానాయికలు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా `మయూరి` ద్వార

ఎన్టీఆర్ చిత్రంలో హంసానందిని

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో కళ్యాణ్రామ్ నిర్మాతగా ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`(వినపడుతున్న పేరు). ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

'గురు' సెన్సార్ పూర్తి.. రిలీజ్ కు సిద్ధం...

విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా,రితిక సింగ్ శిష్యురాలి పాత్రలో రూపొందిన చిత్రం 'గురు'.

బాలీవుడ్ కు శ్రీవిష్ణు చిత్రం...

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు.