14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి బ్యానర్ పై రామ్ , సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,April 08 2016]
నమో వెంకటేశ', దూకుడు', 1 నేనొక్కడినే', లెజెండ్', పవర్'(కన్నడం), ఆగడు', కృష్ణగాడి వీర ప్రేమగాథ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.8, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం ఉగాది పర్వదినాన ఏప్రిల్ 8న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
తొలి సన్నివేశాన్ని హీరో రామ్ పై చిత్రీకరించారు. హరీష్ శంకర్.ఎస్, హను రాఘవపూడి స్క్రిప్ట్ ను సంతోష్‌ శ్రీన్‌వాస్‌కు అందించారు. రామ్, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్ రూపొందిన సూపర్ హిట్ చిత్రం కందిరీగ తర్వాత రూపొందుతున్న ఈ చిత్రం మే మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఆర్ట్: అవినాష్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

More News

నటసింహ నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం అనౌన్స్ మెంట్

ఉగాది సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 100 చిత్రం అనౌన్స్ మెంట్ చేశారు.

'పెన్సిల్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో సూర్య

జి.వి.ప్రకాష్,శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్ తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'పెన్సిల్'.

రాజశేఖర్ ని తేజ తీసేయడానికి కారణం ఇదే..

తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఒకప్పటి యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దీంతో..

ఉగాది సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ 'బహ్మోత్సవం' ఫస్ట్ లుక్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి.సినిమా,ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో

నిర్మాణాంతర కార్యక్రమాలలో వర్మ vs శర్మ

మాస్టర్ చంద్రాంషువు నార్ని సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకం పై గిరిబాబు,జూ.రేలంగి టైటిల్ రోల్ లో బాబ్ రతన్,బిందు బార్బీ జంటగా నటిస్తున్న చిత్రం 'వర్మ vs శర్మ'.