‘‘చోర్ బజార్’’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన స్టైలిష్ హీరో రామ్ పోతినేని

  • IndiaGlitz, [Friday,February 18 2022]

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చోర్ బజార్ సినిమా టైటిల్ సాంగ్ ను శుక్రవారం స్టైలిష్ రామ్ పోతినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ... చోర్ బజార్ టైటిల్ సాంగ్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా ట్రెండీగా ఉండి, గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఆకాష్ క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్ అదిరిపోయినట్లు పాటతో తెలుస్తోంది. రెగ్యులర్ పాటలా కాకుండా ర్యాప్ తో టూడేస్ సాంగ్ లా చేశారు. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆకాష్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా. ఇలాగే ట్రెండ్ సెట్టర్స్ గా సినిమాలు చేస్తూ ఉండాలని విష్ చేస్తున్నా. అన్నారు.

చోర్ బజార్ టైటిల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే...మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె..దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె..ఇది చోర్ బజార్...ఆజా చోర్ బజార్..ప్రతి బస్తీలో ఉంటనేను లేదు నాకు ఆధార్..నచ్చినట్లు బతుకుతుంట లేదు నాకు బాధ...ఖద్దరైన, ఖాకీ అయిన లేదు నాకు తేడా, రంగు రంగు జీవితాలు చోర్ బజార్ ఆజా...అంటూ సాగుతుందీ గీత. రాప్ స్టైల్ లో సాగిన ఈ పాట మంచి ఎనర్జీతో సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను వివరించింది. నవాబ్ గండ్, అసురన్ టీమ్ ఈ పాటకు సంగీతాన్ని, ర్యాప్ అందించి పాడారు

చోర్ బజార్ సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

More News

చంద్రబాబు ఫ్యామిలీకి సొంతూరిలోనే షాక్.. భూమి ఆక్రమణకు యత్నం

భూమి విలువ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ భూమి కనిపించినా..

2008 అహ్మాదాబాద్ పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష... న్యాయస్థానం సంచలన తీర్పు

పద్నాలుగేళ్ల నాటి అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.

కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ చిత్రం.. తెలంగాణ సీఎంకు కడియంలో వినూత్నంగా బర్త్ డే విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే చంద్రశేఖర్ రావుకు ఏపీలోనూ అభిమానులున్న సంగతి తెలిసిందే.

కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పిసి524'లో 'హేలి...' సాంగ్ విడుదల

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. కథానాయకుడిగా పరిచయమైన 'రాజావారు రాణిగారు' సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు.

టాలీవుడ్‌కు బిగ్‌ రిలీఫ్.. రేపటి నుంచి థియేటర్‌లలో 100 శాతం ఆక్యూపెన్సీ

తెలుగు చిత్ర పరిశ్రమ- ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న సమస్యలకు ఓ పరిష్కారం లభించేలా కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి బృందం, మంచు విష్ణులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.