కోర మీసం, పోలీస్ గెటప్‌లో రామ్ పోతినేని పాన్ ఇండియా రౌడీయిజం .. చితక్కొట్టిన ‘ది వారియర్’ ట్రైలర్

  • IndiaGlitz, [Saturday,May 14 2022]

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా నచ్చిన దారిలో సినిమాలు చేసుకుంటే వెళ్లే స్టార్స్‌లో రామ్ పొతినేని కూడా ఒకరు. ఎనర్జిటిక్ హీరోగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ వున్న రామ్‌ ఇటీవల వెరైటీ కథలతో ముందుకు వస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే రామ్ చేసిన రెడ్ పెద్దగా ఆకట్టుకోలేదు. మరో వైపు ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ ఊపందుకోవడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు రామ్. దీనిలో భాగంగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో రామ్ నటించిన యాక్షన్ డ్రామా ‘‘ది వారియర్’’. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం ‘ది వారియర్ ’ నుంచి టీజర్‌ను వదిలారు మేకర్స్. తొలిసారిగా పోలీస్ గెటప్‌లో నటించిన రామ్ ఇరగదీశాడు. ‘ఈ పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నాం అబ్బా’ అనే వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ అవుతుంది. ‘పాన్ ఇండియా సినిమా చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీని చూశారా.. మై డియర్ గ్యాంగ్ స్టార్స్ వీలైతే మారిపోండి.. లేదంటే పారిపోండి ఇదేనేను మీకిచ్చే ఫైనల్ వార్నింగ్’ అంటూ రామ్ చెప్పే డైలాగ్స్‌కి థియేటర్లో కేకలే.

ఇక రామ్‌కు థీటుగా విలన్‌గా కనిపిస్తున్నారు ఆది పినిశెట్టి. ఫైట్స్, డైలాగ్ డెలివరీలో రామ్‌కు ఆది ఎక్కడా తగ్గడం లేదు. అటు విజిల్ మహాలక్ష్మి పాత్రలో కృతి శెట్టి కనిపిస్తున్నారు. సినిమాలో వీరిద్దరి రొమాన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా వుండనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. జులై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘ది వారియర్’ మూవీ రిలీజ్ కానుంది.

More News

నాగచైతన్య - విక్రమ్ కుమార్ ‘‘థాంక్యూ’’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌లో చైతూ లుక్ వైరల్

ఈ  ఏడాది లవ్‌స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తనకు సూటయ్యే కథలతో దూసుకెళ్తున్నారు.

నోటికొచ్చినట్లు హామీలు .. అడిగితే కక్ష సాధింపులు, ఇదీ సీబీఐ దత్తపుత్రుడి తీరు: జగన్‌పై నాదెండ్ల ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

హైదరాబాద్‌లో ఇకపై 24 గంటలూ సిటీ బస్సులు.. ఏయే రూట్లలో అంటే..?

హైదరాబాదీలకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నగరంలో 24 గంటలూ సిటీ బస్సులు నడుస్తాయని వెల్లడించింది.

మీడియాలో వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల లిస్ట్‌ చక్కర్లు .. అలీకి ‘గుడ్‌న్యూస్’ లేనట్లేనా..?

త్వరలో దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు  సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్‌ విడుదల చేసింది.

బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.. క్షమాపణలకు డిమాండ్, 48 గంటలు డెడ్‌లైన్

తెలంగాణలో బీజేపీ దూకుడుతో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు జాతీయ నేతలను రప్పిస్తూ కమలం పార్టీ టీఆర్ఎస్‌కు సవాల్ విసురుతోంది.