రామ్ రిలీజ్ చేసిన 'సీటీమార్‌'లోని మాస్ ఫోక్ సాంగ్ 'జ్వాలారెడ్డి'

  • IndiaGlitz, [Saturday,March 13 2021]

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కి మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌ల‌తో రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ కి, పాట‌ల‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీలోని తెలంగాణ ఫొక్ సాంగ్ 'జ్వాలారెడ్డి' లిరిక‌ల్ సాంగ్‌ని ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రిలీజ్ చేశారు.

జ్వాలారెడ్డి.. జ్వాలారెడ్డి.. తెలంగాణ బిడ్డ‌రో..కారాబోంది ల‌డ్డురో..కారాబోంది ల‌డ్డురో ఆడించే క‌బ‌డ్డిరో..

బాలారెడ్డి..బాలారెడ్డి..ఆంధ్రాటీమ్ హెడ్డురో..కోన‌సీమ బ్లెడ్డురో.. కోన‌సీమ బ్లెడ్డురో.. పోర‌డు ఏ టూ జెడ్డురో..

అంటూ సాగే ఈ తెలంగాణ మాస్ ఫోక్ సాంగ్‌కి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా శంక‌ర్‌బాబు, మంగ్లీ ఆల‌పించారు. ఈ సాంగ్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న  వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయ‌నున్నారు. 

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.

More News

నాగార్జున మ‌రో కోణాన్ని ఎలివేట్ చేస్తున్న 'వైల్డ్ డాగ్‌'

అక్కినేని నాగార్జున అంటే రొమాంటిక్ సినిమాలే ఎక్కువ‌గా గుర్తుకు వ‌స్తాయి. మాస్ పాత్ర‌ల్లో నాగార్జున మెప్పించిన సినిమాలు త‌క్కువే. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నాగార్జున వైవిధ్య‌మైన

పవన్‌కు పోటీగా నిధి అగర్వాల్ పాత్ర

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్‌గా రెండు సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నారు. ఇందులో ఓ సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. మెఘల్ కాలపు నేపథ్యంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ మూవీ ఇది.

ఉబర్ డ్రైవర్ మాస్క్ పెట్టుకోమన్నందుకు రచ్చ రచ్చ చేసిన మహిళలు

కొందరి ప్రవర్తన ఎదుటి వారికి ఎంత ఇబ్బందికరంగా పరిణమిస్తుందో చెప్పేందుకు ఈ న్యూసే ఉదాహరణ. అసలే కరోనా సమయం.. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది.

పవన్ ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ స్టోరీ ఇదేనట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో పిరియాడిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి వైరల్

'గాలిసంప‌త్' కి అద్వితీయ‌మైన రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది - రాజేంద్రప్ర‌సాద్‌

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ పాత్ర‌లో రూపొందిన‌ చిత్రం `గాలి సంప‌త్.