close
Choose your channels

ఆ దర్శకుడితో రామ్ మరోసారి...

Tuesday, June 28, 2016 • తెలుగు Comments

నేను శైల‌జ త‌ర్వాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు 14 రీల్స్ బ్యాన‌ర్‌పై  సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత రామ్ ఏ సినిమా చేస్తాడ‌ని అనుకుంటున్న త‌రుణంలో ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో గుడ్డివాడి పాత్ర‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలిసింది.

అయితే రామ్ కొద్దిగా స్పీడ్ పెంచానుకున్నాడు అందుక‌నే మ‌రో సినిమాలో కూడా స‌మాంత‌రంగా చేయాల‌నుకుటున్నాడ‌ట‌. గ‌తంలో రామ్ హీరోగా రూపొందిన ఎందుకంటే ప్రేమ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని చేయ‌డానికి మొగ్గు చూపుతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. దీని గురించి త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలుస్తాయి.

Get Breaking News Alerts From IndiaGlitz