సచిన్‌‌కు వెరైటీగా బర్త్ ‌డే విషెస్ చెప్పిన రామ్

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ పుట్టిన రోజు నేడు. నేటితో ఆయన 46వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సచిన్‌‌కు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ ట్విట్టర్ వేదికగా వెరైటీగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

రామ్ ట్వీట్ సారాంశం..

పార్క్‌లో కూర్చోని బిస్కెట్లు తినే పిల్లలకు.. ఎలా చెప్పినా వింటారు. బెడ్రూమ్‌లో లాక్ వేసుకుని లైఫ్ ఎలా రా అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు. ఇంటర్ కూడా పూర్తిచేయని ద ఫ్రైడ్ ఆఫ్ నేషన్ సచిన్ టెండుల్కర్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని రామ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

కాగా.. ఇంటర్ ఫలితాలు విడుదలైన నాటి నుంచి పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు ఇంటర్ బోర్డు తప్పిదాల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కలకం రేపుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశించి రెండ్రోజులుగా రామ్ ఇలా ట్వీట్ చేస్తూ విద్యార్థులకు ధైర్యం చెబుతున్నాడు. రామ్ ట్వీట్‌కు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.