'శివమ్' బాటలో 'ఉన్నది ఒకటే జిందగీ'

  • IndiaGlitz, [Tuesday,September 26 2017]

దేవ‌దాసుతో క‌థానాయ‌కుడిగా కెరీర్‌ని మొద‌లుపెట్టిన యువ క‌థానాయ‌కుడు రామ్‌.. రెడీ, మ‌స్కా, కంద‌రీగ‌, నేను శైల‌జ వంటి విజ‌యాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ యువ క‌థానాయ‌కుడు ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అనే సినిమా చేస్తున్నాడు. నేను శైల‌జ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఇటలీలోని మిల‌న్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. చిత్రీక‌ర‌ణ దాదాపు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింద‌ని.. అక్టోబ‌ర్ 27న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నార‌ని ఇన్‌సైడ్ టాక్‌.

అదే జ‌రిగితే.. రామ్ కెరీర్‌లో ఓ డిజాస్ట‌ర్‌గా నిలిచిన శివ‌మ్‌ విడుద‌లైన అక్టోబ‌ర్ నెల‌లోనే రామ్ నుంచి వ‌చ్చే మ‌రో సినిమా ఇదే అవుతుంది. శివ‌మ్‌కి క‌లిసిరాని అక్టోబ‌ర్.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీకైనా రామ్‌కి క‌లిసొస్తుందేమో చూడాలి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు.

More News

మ‌హేష్‌, విజ‌య్ తో సినిమా చేస్తా

మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ చిత్రాన్ని రూపొందించిన ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌.. 11 ఏళ్ల త‌రువాత రూపొందించిన తెలుగు చిత్రం స్పైడ‌ర్‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

పెళ్లి రోజు ఆడియో విడుదల

పెళ్లిరోజు అనేది ప్రతివారి జీవితంలోనూ ఎంతో ప్రాధాన్యత వహిస్తుందని, ప్రతివారి జీవితానికి స్ఫూర్తిని,శాంతిని సౌభాగ్యాన్ని అందించే శక్తి అందులో ఉందని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్. కొణిజేటి రోశయ్య చెప్పారు.

'స్పైడర్ ' లో సరికొత్త మహేష్ ని చూస్తారు - ఎ.ఆర్.మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రకుల్ ప్రీత్ హీరోయిన్ గా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

ర‌జ‌నీ సినిమాకి టైం ప‌డుతుంద‌న్న మురుగ‌దాస్‌

తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో స్పైడ‌ర్ సినిమాని రూపొందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్.. అతి త్వ‌ర‌లో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సినిమా తెర‌కెక్కించ‌నున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి.

స‌మంత.. రెండు చోట్లా..

తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో రెండు సినిమాలు దీపావ‌ళి సీజ‌న్‌కి.. రెండు సినిమాలు సంక్రాంతి సీజ‌న్‌కి విడుద‌ల కానుండ‌డం విశేషం.