భర్త కోసం రంభ కోర్టులో పిటిషన్..!

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

త‌న అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుని తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకున్న అందాల తార రంభ‌. పెళ్లి చేసుకుని సెటిలైన రంభ ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...కెన‌డా వ్యాపారి ఇందిర‌న్ ప‌ద్మ‌నాధ‌న్ ను రంభ పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే కుటుంబ క‌ల‌హాల వ‌ల‌న ఈ దంప‌తులు కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు.
ఇప్పుడు త‌న భ‌ర్త‌తో త‌నను క‌ల‌పాల‌ని, మ‌ళ్ళీ అత‌నితో క‌లిసి జీవిస్తాన‌ని సినీ న‌టి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించారు. హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 9 ప్ర‌కారం పిటిష‌న్ వేసారు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం భార్య లేక భ‌ర్త స‌రైన కార‌ణం లేకుండానే భాగ‌స్వామి నుంచి విడిపోయిన‌ప్పుడు ఆ జంట‌లో వేరుగా ఉండ‌డం ఇష్టం లేని వ్య‌క్తి త‌న దాంప‌త్య హ‌క్కుల కోసం త‌మ‌ని క‌ల‌పాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చు. రంభ కేసు విష‌యంలో త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌ను కోర్టు డిసెంబ‌ర్ 3న చేప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం.

More News

దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సూర్య‌..!

త‌మిళ హీరో కార్తి కాష్మోరా సినిమాతో దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి...సూర్య దీపావ‌ళికి రావ‌డం ఏమిటి అనుకుంటున్నారా..?

ఎదుట వ్యక్తికి సాయం చేయడానికి మంచి మనసు ఉంటే చాలు అని చెప్పే వైవిధ్యమైన చిత్రం ఛల్ ఛల్ గుర్రం - హీరో శైలేష్

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో మోహన ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ఛల్ ఛల్ గుర్రం. ఎం.ఆర్. ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఎం.రాఘవయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాలీవుడ్ లో పూరి ఇజం..!

డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఇజం

రాజ్ తరుణ్, వెలిగొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'అంధగాడు' ప్రారంభం

కుమారి 21ఎఫ్,ఈడోరకం-ఆడోరకం వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్,

దిల్ రాజు ను మెప్పించిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

రావు రమేష్,హెబ్బా పటేల్,తేజస్వి,అశ్విన్,పార్వతీశం,నోయల్ సెన్ ప్రధాన పాత్రల్లో భాస్కర్ బండి తెరకెక్కించిన చిత్రం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.