close
Choose your channels

లంచ్ డేట్ లో ఉపాసన, రాంచరణ్.. బ్యూటిఫుల్ క్లిక్ వైరల్

Wednesday, July 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రొమాంటిక్ కపుల్ మెగాపవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన మధ్య అన్యోన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. చరణ్, ఉపాసన తరచుగా వెకేషన్స్ కి వెళుతుంటారు. ప్రస్తుతం చరణ్ తన సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ తన సతీమణి కోసం టైం కేటాయిస్తున్నాడు.

భార్యతో కలసి చరణ్ లంచ్ డేట్ కి వెళ్ళాడు. ఈ సంగతిని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మిడ్ వీక్ లంచ్ డేట్ అని ట్వీట్ చేసింది. లంచ్ డేట్ లో చరణ్, ఉపాసన కలసి ఉన్న బ్యూటిఫుల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక రెండు సాంగ్స్ మాత్రమే షూటింగ్ మిగిలివుంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కాగా చరణ్, శంకర్ కాంబోలో చిత్రానికి రంగం సిద్ధం అయింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు టాక్. ఇటీవలే చరణ్, దిల్ రాజు ఇద్దరూ చెన్నైలో శంకర్ ని కలసి వచ్చిన సంగతి తెలిసిందే.

ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహిళ. తరచుగా ఉపాసన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే నెటిజన్లకు హెల్త్ టిప్స్ అందిస్తూ ఉంటుంది. ఉపాసన చరణ్ ని 'మిస్టర్ సి' అని ముద్దుగా పిలుచుకోవడం చూస్తూనే ఉన్నాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos