‘ఆచార్య‌’ సెట్స్‌లోకి రామ్‌చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Sunday,January 17 2021]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ‘ఆచార్య‌’ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశాడు. సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ పాత్ర పేరు ‘సిద్ధ‌’ అని కొర‌టాల తెలియ‌జేస్తూ చెవిలో పోగు పెట్టుకుని, మెడ‌లో రుద్రాక్ష మాల వేసుకున్న గ‌డ్డం ఉన్న లుక్‌తో రామ్‌చ‌ర‌ణ్ ఫొటోను వెనుక వైపు నుండి పోస్ట్ చేశాడు కొర‌టాల‌. ఈ ఫోటోతో పాటు మా ' సిద్ధ ' సర్వం సిద్ధం అని కూడా పోస్ట్ చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. ఇందులో చిరంజీవి మాజీ నక్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. కాగా.. రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే న‌క్స‌లైట్ నాయ‌కుడు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. మ‌రి ఆ పాత్ర‌ను కొర‌టాల శివ ఎలా ఎలివేట్ చేస్తాడోన‌నేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. దేవాదాయ‌శాఖ‌లోని అవినీతిని ప్ర‌శ్నించేలా కొర‌టాల శివ ‘ఆచార్య‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. హైద‌రాబాద్ శివారు ప్రాంత‌మైన కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో ఈ సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మే 9న ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

కంగ‌నాకు షాక్‌.. లీగ‌ల్ నోటీసులు

ఫ‌ర్ బ్రాండ్ కంగనా ర‌నౌత్.. ఈ పేరు చెబితే కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అనే పేరే ముందుగా వినిపిస్తుంది. బాలీవుడ్‌లో చాలా మంది కంగ‌నా ర‌నౌత్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారే.

వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ సిద్ధం

డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ ..‘ఎఫ్ 2’, ‘గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

అఖిల్ కోసం భారీ స్టార్ కాస్ట్‌..!

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

మూడో స్థానంలో జగన్.. కేసీఆర్ ఎక్కడ?

సీఎం కేసీఆర్.. తెలంగాణ పోరులో ముందు వరుసలో నిలిచారు. తెలంగాణ రావడంలో కీలకమయ్యారు.

మోదీ నోట గురజాడ మాట.. ఖుషీ అవుతున్న తెలుగు ప్రజలు

మహాకవి గురజాడ అప్పారావు మాటలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. నేడు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను మోదీ ప్రారంభించారు.