పూర్తయిన రమేశ్ బాబు అంత్యక్రియలు.. అన్న చివరి చూపుకు నోచుకోని మహేష్

  • IndiaGlitz, [Sunday,January 09 2022]

అనారోగ్యంతో మరణించిన సినీనటుడు, నిర్మాత నటుడు, నిర్మాత రమేశ్‌ బాబు అంత్యక్రియలు ముగిశాయి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నిర్వహించిన రమేశ్‌బాబు అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

అంత్యక్రియలకు ముందు రమేశ్‌‌బాబు పార్థివ దేహాన్ని అభిమానులు, కుటుంబసభ్యుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. స్టూడియోకి చేరుకున్న కృష్ణ, ఆయన సతీమణి ఇందిరాదేవి రమేశ్ బాబు పార్థివదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే కరోనా సోకిన కారణంగా మహేశ్‌బాబు, ఆయన కుటుంబం ఐసోలేషన్‌లో వుండటంతో రమేశ్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు.

ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో అంత్యక్రియలు త్వరగా ముగించాలని కృష్ణ కుటుంబ సభ్యులు భావించారు. రమేశ్‌ బాబు అంతిమ కార్యక్రమాలకు ఎక్కువమంది హాజరు కావొద్దని కృష్ణ ఫ్యామిలీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. రెండేళ్ల క్రితం సతీమణి విజయ నిర్మల మరణించగా.. ఇప్పుడు కుమారుడి మరణంతో కృష్ణకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. దీంతో ఆయనను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

More News

కోవిడ్‌తో క్వారంటైన్‌లో మహేశ్.. అన్నయ్య అంత్యక్రియలకు హాజరవుతారా..?

జీవితంలో మన కష్టసుఖాల్లో తోడుండి.. అన్నింట్లో ఆసరాగా నిలిచిన ఆత్మీయుల మరణం ఏ మనిషికైనా తీరని లోటే.

సూపర్‌స్టార్ మహేశ్ సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత

టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న

కాలేజ్, లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రౌడీ బాయ్స్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాల విడుదలు వాయిదా పడటంతో ఈ సంక్రాంతికి అన్నీ చిన్న సినిమాలే హల్ చల్ చేయబోతున్నాయి.

రూ.100 కోట్ల ఆఫర్ తిరస్కరణ.. థియేటర్‌లోనే సుదీప్ ‘‘విక్రాంత్ రోణా’’

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్.

సినిమాలను నియంత్రించినట్లు.. వీటిని కంట్రోల్ చేయగలారా: ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.