close
Choose your channels

లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా వార్తలపై రమేష్ క్లారిటీ

Tuesday, November 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా వార్తలపై రమేష్ క్లారిటీ

లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్ఈపీఎల్) కంపెనీ దివాలా తీసినట్లు వస్తున్న వార్తలపై ఎల్ఈపీఎల్ కంపెనీ అధినేత లింగమనేని రమేష్ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఓ ప్రకటనను ఆయన విడుదల చేశారు. ‘మా సంస్ధను దివాలాగా ప్రకటించాలని మేమెప్పుడూ కోరలేదు. జర్మనీకి చెందిన ఓ సంస్ధతో ఎయిర్ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయి.

వాటిని పరిష్కరించుకునే లోపే సదరు సంస్ధ లా ట్రైబ్యునల్‌లో దివాలా పిటిషన్ వేసింది. జర్మన్ సంస్ధ పిటిషన్ ఆధారంగా కంపెనీస్ లా బ్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్ లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదు. మా ఆర్ధిక పరిస్ధితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో కూడా మా రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎప్పుడూ లేదు’ అని సదరు సంస్థ ప్రతినిధి రమేష్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.