నాకు దేవుడు ఇచ్చిన వ‌రం కొలంబ‌స్ : డైరెక్ట‌ర్ ర‌మేష్ సామ‌ల‌

  • IndiaGlitz, [Monday,October 26 2015]

సుమంత్ అశ్విన్, శీర‌త్ క‌పూర్, మిస్టీ హీరో,హీరోయిన్స్ గా ర‌మేష్ సామ‌ల తెర‌కెక్కించిన చిత్రం కొలంబ‌స్. యూత్ ను ఆక‌ట్టుకునే విభిన్న క‌ధాంశంతో రూపొందిన కొలంబ‌స్ చిత్రం ద‌స‌రా రోజు రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా కొలంబ‌స్ డైరెక్ట‌ర్ ర‌మేష్ సామ‌ల ఇంట‌ర్ వ్యూ మీకోసం...

మీ గురించి చెప్పండి..?

నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం. ఎప్ప‌టికైనా డైరెక్ట‌ర్ అవ్వాల‌నేది నా క‌ల‌. 12 సంవ‌త్స‌రాలుగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, విజ‌య‌భాస్క‌ర్, విక్ర‌మ్ కుమార్ ల ద‌గ్గ‌ర డైరెక్ష‌న్ డిపార్టెమెంట్ లో వ‌ర్క్ చేసాను. కొలంబ‌స్ సినిమాతో డైరెక్ట‌ర్ అయ్యాను.

కొలంబ‌స్ సినిమాకి వ‌స్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది..?

మా సినిమాకి అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సినిమాకి నేను డైరెక్ట‌ర్ అవ్వ‌డం దేవుడి ఇచ్చిన వ‌రంలా ఉంది. నా మొద‌టి సినిమా స‌క్సెస్ కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి మ‌రిన్ని థియేట‌ర్ల‌ను కూడా పెంచుతున్నాం. ఓవ‌ర్ సీస్ లో ఈనెల 30న కొలంబ‌స్ ను రిలీజ్ చేస్తున్నాం

కొలంబ‌స్ కి డైరెక్ట‌ర్ అయ్యే అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?

సుమంత్ అశ్విన్ మొద‌టి సినిమా తూనీగ తూనీగ కి అనుకోకుండా రైట‌ర్ గా వ‌ర్క్ చేసాను.ఈ సినిమాకి కొన్ని సీన్స్ మాత్ర‌మే రాసాను. ఒక‌రోజు దిల్ రాజు గారింటికి వెళ్లాను. అక్క‌డ ఎం.ఎస్.రాజు గారు కూడా ఉన్నారు. అప్పుడు దిల్ రాజు గారు..న‌న్ను ఎం.ఎస్.రాజు గారికి ప‌రిచ‌యం చేసారు. ఆత‌ర్వాత ఎం.ఎస్.రాజు గారు పిలిచి ఓ క‌థ చెప్పి డైలాగ్స్ రాయ‌మ‌న్నారు. డైలాగ్స్ రాసిన త‌ర్వాత ఈ క‌థ ఎవ‌రితో చేస్తే బాగుంటుంది అంటే సుమంత్ అశ్విన్ తోనే బాగుంటుంది అని చెప్పాను. కొత్త‌వాళ్ల‌తో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. కొన్ని రోజుల త‌ర్వాత‌ ఎం.ఎస్.రాజు గారు పిలిచి ఈ మూవీకి నువ్వే డైరెక్ట‌ర్ అన్నారు. ఆయ‌న అలా అన‌డం దేవుడిచ్చిన వ‌రం లా అనిపించింది. అప్పుడు నేనైతే కొత్త‌వాళ్ల‌తో చేయ‌లేను. నాకు సుమంత్ అశ్విన్ కావాలంటే..స‌రే అన్నారు. ఆవిధంగా ఈ సినిమాకి డైరెక్ట‌ర్ గా అవ‌కాశం వ‌చ్చింది.

ఎం.ఎస్.రాజు గారు రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ కూడా..మ‌రి..ఈ సినిమాలో ఆయ‌న ఇన్ వాల్వ్ మెంట్ ఎంత వ‌ర‌కు ఉంది..?

ఈ సినిమాకి ఎం.ఎస్.రాజు గారు క‌థ‌-స్ర్కీన్ ప్లే అందించారు. అలాగే ఆయ‌న నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన భారీ చిత్రాల‌ను అందించారు. ఆయ‌నకు ఉన్న అనుభ‌వంతో షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత సీన్స్ చూసి..ఎలా ఉన్నాయి...ఇంకా బెట‌ర్ గా ఎలా ఉంటే బాగుంటుందో..స‌ల‌హాలు..సూచ‌న‌లు అందించారు. అంతే త‌ప్ప నా డైరెక్ష‌న్ లో ఆయ‌న ప్ర‌మేయం లేదు.

కొలంబ‌స్ క‌థ‌లో మిమ్మిల్ని ఇన్ స్పైయిర్ చేసిన పాయింట్ ఏమిటి..?

ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి అంటే చిన్న క‌న్ ఫ్యూజ‌న్ ఉంటుంది. కానీ..ఇందులో ఎలాంటి క‌న్ ఫ్యూజ‌న్ ఉండ‌దు. అది న‌న్ను బాగా ఇన్ స్పైయిర్ చేసింది.

మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం..? ఏ త‌ర‌హా సినిమాలు తీయాల‌నుకుంటున్నారు..?

నాకు మ‌ణిరత్నం గారి సినిమాలు ఇష్టం. ఎమోష‌న్స్ ను ఎక్కువుగా ఇష్ట‌ప‌డతాను. అందుచేత అంద‌రికీ న‌చ్చేలా ఎమోష‌న్స్ ఉండే సినిమాలు తీయాల‌నుకుంటున్నాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి...

నా త‌దుప‌రి చిత్రానికి క‌థ రెడీగా ఉంది. అవ‌కాశాలు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు తెలియ‌చేస్తాను.

More News

అసిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి..సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ అసిన్.అనతి కాలంలోనే బాలక్రిష్ణ,నాగార్జున,వెంకటేష్...

'శ్రీమంతుడు' బాటలోనే..

''మిర్చి'',''శ్రీమంతుడు''..ఇలా వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ.తన మూడో చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించనున్నాడు.

శ్రుతి హాసన్ బాగానే స్కెచ్ వేస్తోంది

తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల నటి శ్రుతి హాసన్..తమిళంలో మాత్రం పెద్దగా విజయాలను మూటగట్టుకోలేక పోతోంది.

ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్

గత రెండేళ్లుగా ఏడాదికో సినిమాతోనే సరిపెడుతున్న ఎన్టీఆర్..వచ్చే ఏడాదిలో రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు.

తమన్నా తరహాలో రకుల్ కూడా..

తమన్నా అడుగుజాడల్లోనే రకుల్ ప్రీత్ సింగ్ నడుస్తోందా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ లో.ఇంతకీ రకుల్ ఏ విషయంలో తమన్నాని ఫాలో అవుతుందంటే..