డిస్నీ చేతికి రామోజీ ఫిలింసిటి?

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు.. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కూడా కూల్చేసిందనేది కొందరి వాదన. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండతో పాటు రామోజీ ఫిలింసిటీ కూడా గుర్తొస్తుంది. ఏసియాలోనే దీనికి ప్రత్యేకమైన స్థానముంది. కరోనా కాటులో ఇది కూడా బలైందనేది బహిరంగ రహస్యమే. రామోజీ ఫిలింసిటీకి రోజుకు 10 వేల మంది సందర్శకులు వచ్చేవారు. సినిమా, సీరియల్ షూటింగ్స్‌.. బిజినెస్ ఈవెంట్స్, ఫంక్ష‌న్స్.. ఆడియో లాంచ్‌లతో నిత్యం బిజీ బిజీగా ఉండేది. కరోనా కారణంగా నాలుగు నెలలుగా షూటింగ్స్.. సందర్శకులు.. ఈవెంట్స్.. ఫంక్షన్స్ ఏమీ లేవు. దీంతో భారీగా నష్టం వచ్చిందని తెలుస్తోంది.

ఒక రోజుకు ఫిలింసిటీ ఆదాయం కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. అలాంటిది నాలుగు నెలలుగా మూతపడింది. మరోవైపు పత్రికలు మరీ దీన స్థితికి చేరుకున్నాయి. ఈనాడు పేపర్ అంటే ఓ బ్రాండ్. కానీ కరోనా కారణంగా లక్షల్లో ఉండే సర్కులేషన్.. వేలల్లోకి పడిపోయింది. మరోవైపు యాడ్స్ కూడా లేవు. దీంతో పత్రిక సైతం భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోందని టాక్. అన్నీటి పరంగా చూస్తే.. రామోజీ సంస్థలలో రామోజీ ఫిలింసిటీకి వేల కోట్లలో నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నేపథ్యంలో రామోజీ ఫిలింసిటీని డిస్నీ వరల్డ్‌కు లీజ్‌కు ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. మూడేళ్లకు అగ్రిమెంట్ జరిగినట్టు పుకారు షికారు చేస్తోంది.. దీనిపై నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

More News

హైదరాబాద్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ లేనట్టేనా?

హైదరాబాద్‌లో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతుండటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించాలని భావించింది.

'A' (AD ‌INFINITUM) టీజర్ కు విశేష స్పందన!

సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం “A”. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల  అంచనాలను  పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది,

న‌టుడిగా నాలో మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్ర‌మే ‘భాన‌మ‌తి రామ‌కృష్ణ‌’ - న‌వీన్ చంద్ర‌

‘అందాల రాక్ష‌సి’ నుండి న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్క‌రించుకుంటూ వ‌స్తున్న న‌వీన్ చంద్ర హీరోగా స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’.

వారెవరో నాకు తెలియదు.. ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యొద్దు: పూర్ణ

తనను, తన కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ షమ్నా ఖాసిం(పూర్ణ).. సినీ నటుడు ధర్మజన్ బోల్గట్టితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

చిరు సోద‌రి పాత్ర‌లో మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.