దెయ్యం పాత్రలో శివగామి....

  • IndiaGlitz, [Saturday,February 06 2016]

బాహుబ‌లి చిత్రంతో శివ‌గామిగా నేష‌న‌ల్ వైడ్ పేమ‌స్ అయిన ర‌మ్య‌కృష్ణ త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నాలో స‌త్య‌వ‌తిగా అల‌రించారు. త్వ‌ర‌లోనే కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రుద్రాక్ష సినిమాలో న‌టిస్తుందని వార్త‌లు వినిపించాయి. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ ఓ ఆత్మ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ట‌. దాదాపు పుష్క‌ర కాలం త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌, కృష్ణ‌వంశీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా. 2004లో విడుద‌లైన శ్రీ ఆంజ‌నేయం త‌ర్వాత రానున్న సినిమా ఇది. ఈ సినిమాలో స‌మంత కూడా న‌టిస్తుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

విలన్ గా లారెన్స్....

కొరియోగ్రాఫర్ గా,దర్శకుడుగా తనదైన స్టయిల్ లో రాణిస్తున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు తెలుగు పటాస్ రీమేక్ తమిళ్ వెర్షన్ లో హీరోగా నటిస్తున్నాడు.

'అ..ఆ' రిలీజ్ డేట్...

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరో యంగ్ డైరెక్టర్ తో శర్వానంద్..

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించాడు యంగ్ హీరో శర్వానంద్.

సర్ధార్ రిలీజ్ కి ముహుర్తం కుదిరింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

మహేష్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్...

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే.