డిజిట‌ల్‌కు రానా త్రిభాషా చిత్రం

  • IndiaGlitz, [Wednesday,May 20 2020]

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో సినీ రంగం కుదేలైంది.ముఖ్యంగా చిన్న సినిమాల ప‌రిస్థితి ఘోరంగా తయారైంది. సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం క‌ష్టంగా ఉంది. ఇప్పుడు క‌రోనా వ‌ల్ల పెద్ద సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇవ‌న్నీ ఇప్పుడు త‌దుప‌రి మంచి రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ త‌రుణంలో చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌డం ఆషామాషీ కాదు. దీంతో చిన్న సినిమాల నిర్మాత‌లు ఓటీటీల‌పై ఆసక్తిక‌న‌ప‌రుస్తున్నారు. సురేష్‌బాబు వంటి సీనియ‌ర్ నిర్మాత కూడా న‌ష్టాలు రావనుకుంటే చిన్న సినిమాల‌కు ఓటీటీ బెస్ట్ మాధ్య‌మం అని చెప్పేశారు.

ప‌లు చిత్రాలు ఓటీటీలో విడుద‌ల కావ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ క‌మ్రంలో రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర పోషించిన అర‌ణ్య చిత్రం ఓటీటీలో విడుద‌ల‌కు సిద్ధ‌మైంద‌ట‌. ప్ర‌భుసాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో కష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. ఇప్పుడు నిర్మాత‌లు సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్

కరోనా లాక్ డౌన్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిరు పరవు తీయకు.. నాగబాబుపై కేసు నమోదు

జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.

ఎన్టీఆర్ బర్త్ డే.. ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.

కరోనా నుంచి భారత్ కోలుకుంటున్నట్లేనా!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి థాటి నుంచి ఇండియా కోలుకుంటుందా..? ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా కాసింత మెరుగుపడుతోందా..?