close
Choose your channels

రియాకు టాలీవుడ్‌తో లింకులు.. ఆమె కాంటాక్టు లిస్ట్‌లో రానా, రకుల్

Wednesday, August 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రియాకు టాలీవుడ్‌తో లింకులు.. ఆమె కాంటాక్టు లిస్ట్‌లో రానా, రకుల్

ఇటీవల మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి కాల్ రికార్డులను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమె పలువురు ప్రముఖులతో సన్నిహితంగా మెలిగినట్టు రియా కాల్ రికార్డుల ఆధారంగా అధికారులు గుర్తించారు. టాలీవుడ్ నటులతో కూడా రియా కాంటాక్ట్‌లో ఉన్నట్టు గుర్తించారు. రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఆమె కాంటాక్ట్ లిస్టులో ఉండటం గమనార్హం. వీరితో పాటు బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు రియాతో సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు గుర్తించారు.

సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుశాంత్ మృతికి సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను సైతం విచారిస్తోంది. ఈ నేపథ్యంలో రియా కాల్ రికార్డును అధికారులు పరిశీలించారు. రకుల్ ప్రీత్‌కు రియా 30 సార్లు కాల్ చేయగా.. తిరిగి రియాకు రకుల్ 14 సార్లు కాల్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఎస్ఎంఎస్‌ల పరంపర కూడా నడిచినట్టుగా అధికారులు గుర్తించారు. అదే విధంగా రానా దగ్గుబాటికి రియా ఏడుసార్లు కాల్ చేయగా.. తిరిగి రానా ఆమెకు నాలుగు సార్లు కాల్ చేసినట్టు అధికారులు గుర్తించారు.

రియాకు టాలీవుడ్‌తో లింకులు.. ఆమె కాంటాక్టు లిస్ట్‌లో రానా, రకుల్

ఇకపోతే బాలీవుడ్ ప్రముఖ హీరో అయిన అమీర్‌ఖాన్‌కు రియా ఒకసారి ఫోన్ చేయగా.. ఆయన మూడు ఎస్ఎంఎస్‌లను రియాకు పంపించారు. అయితే సీడీఆర్ జాబితాలో పేర్కొన్న నంబర్ సూపర్ స్టార్‌కు చెందినదని పరిశ్రమలోని కొందరు వ్యక్తులు ఐఎఎన్‌ఎస్‌కు ధృవీకరించారు. సుశాంత్ మరణానికి సంబంధించి కానీ.. ఈ కేసుకు సంబంధించి కానీ బాలీవుడ్‌కి చెందిన ముగ్గురు ఖాన్స్ (సల్మాన్, షారుఖ్ మరియు అమీర్) సైలెంట్‌గా ఉండటం గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు, రియా కాల్ రికార్డులలో అమీర్ ఖాన్ పేరు కనిపించడం మరింత చర్చనీయాంశంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.