డిసెంబర్ 31న విడుదలవుతున్న రానా దగ్గుబాటి, సత్య శివ, సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. '1945'

  • IndiaGlitz, [Friday,December 10 2021]

బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు. అందులో 1945 ఒకటి. ఈ పీరియడ్ డ్రామాను సత్యశివ తెరకెక్కించారు. ఈ ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీ కళ్యాణ్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

1945 సినిమా డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రను రానా పోషించారు.

ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సత్య కెమెరామెన్‌గా, గోపీ కృష్ణ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

More News

ల‌క్ష్య మూవీ స‌క్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - హీరో నాగ‌శౌర్య‌

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌ కోసం శ్రీరామ్ త్యాగం.. కాజల్‌ సెటైర్లు, మళ్లీ సిరి- షన్నూ హగ్గులు

బిగ్‌బాస్ 5 తెలుగులో రోల్ ప్లే టాస్క్ కంటిన్యూ అవుతోంది. అలాగే  టాస్కుల్లో బాగా ఆడిన వారికి ప్రజలను ఓట్లు అడిగే ఛాన్స్  ఇచ్చారు బిగ్‌బాస్.

బిగ్‌బాస్ 5 తెలుగు: నీ గురించి ఫైట్ చేస్తుంటే.. మీ అమ్మకి ‘‘హగ్’’ ఒక్కటే గుర్తుంది, సిరిపై షణ్ముఖ్ ఫైర్

బిగ్‌బాస్ 5 తెలుగులో తుది అంకానికి చేరుకుంది. ఇక ఒకే ఒక్క వారం షో మిగిలివుంది. నిన్న హౌస్‌లో జరిగిన టాప్ ఇన్సిడెంట్స్‌ని ఇంటి సభ్యులు చేసి చూపించారు.

మహేశ్ బ్రాండ్ లాగేసుకున్న రౌడీ స్టార్... స్పీడ్ మామూలుగా లేదుగా..!!

చిన్నా చితకా క్యారెక్టర్లు చేసుకునే స్థాయి నుంచి తెలుగులో టాప్ స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు విజయ్ దేవరకొండ.

'కుంభస్థలాన్నే కొడదాం పదా '.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.