close
Choose your channels

వారేవా.. సూపర్ హీరోగా రానా దగ్గుబాటి

Friday, July 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వారేవా.. సూపర్ హీరోగా రానా దగ్గుబాటి

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడి పాత్రతో రానా నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఘాజి చిత్రం కూడా రానా క్రేజ్ ని పెంచింది. చాలా రోజుల తర్వాత రానా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలలో రానా తన ఫ్యూచర్ ప్లాన్స్ వివరించాడు. ఇందులో రానా అభిమానులు థ్రిల్ ఫీలయ్యే న్యూస్ కూడా ఉంది. త్వరలో రానా సూపర్ హీరోగా నటించబోతున్నాడు. స్వయంగా రానానే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎవరు? ఎలాంటి సూపర్ హీరో చిత్రం ? నటీనటులు ఎవరు ? లాంటి విషయాలని రానా రివీల్ చేయలేదు. రానా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో థానోస్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

కానీ త్వరలో రానా సూపర్ హీరోగా కనిపించబోతున్నది మాత్రం ఖాయం. తనకు యాక్షన్ మూవీస్, మైథాలజీ కథలంటే కూడా చాలా ఇష్టం అని రానా రివీల్ చేశాడు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే ఉంటానని రానా తెలిపాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యపు'లో నటించాల్సి ఉంది. ఈ చిత్రానికి తెరవెనుక కొన్నేళ్లుగా సన్నాహకాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం రానా నక్సలైట్ పాత్రలో విరాటపర్వం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రానా నటిస్తున్న మరో క్రేజీ చిత్రం అయ్యప్పన్ కోషియం రీమేక్. తొలిసారి రానా ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.