రూమర్స్ ను నమ్మొద్దు..నేనే చెప్తా - రానా

  • IndiaGlitz, [Wednesday,June 21 2017]

ఆర‌డుగు అజానుభాహుడైన రానా మాస్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నించకుండా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాల‌నే ఎంచుకుంటున్నాడు. హీరోగానే చేయాల‌ని కాకుండా పాత్ర‌కు మంచి గుర్తింపు ల‌భిస్తుంద‌నిపిస్తే చాలు చిన్న పాత్ర‌లోనైనా చేయ‌డానికి రెడీ అయిపోతున్నాడు. అందుక‌నే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రంలో న‌టించాడు. ఇప్పుడు రానా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమా కాకుండా వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ని న్యూస్ విన‌ప‌డింది.
అయితే ఈ వార్త‌ల‌పై రానా గ‌ట్టిగానే స్పందించాడు. ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన రానా తాను చేయ‌బోయే సినిమాల గురించి తానే చెబుతాన‌ని, రూమ‌ర్స్‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలియ‌జేశాడు. దీంతో రానా. వినాయ‌క్ కాంబినేష‌న్‌లో సినిమా గురించి విన‌ప‌డుతున్న వార్త‌లు అవాస్త‌వ‌మని తేలిపోయాయి. రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. జూన్ 23న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో రానా జోగింద‌ర్ అనే పొలిటీషియ‌న్ పాత్ర చేస్తున్నాడు.

More News

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన - టి.సుబ్బరామిరెడ్డి

'ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్వీ,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు'

పురాణ పాత్రలో రానా....

ఈ తరం హీరోల్లో దగ్గుబాటి రానా విలక్షణమైన కథలను, పాత్రలను ఎన్నుకుంటూ సాగిపోతున్నాడు. బాహుబలిలో భళ్ళాలదేవగా రానా నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది.

మోడి బయోపిక్ లో అక్షయ్...

ఇప్పుడు బాలీవుడ్లో బయోపిక్ లహవా నడుస్తుంది.

నూతన నటీనటులతో కాలేజీ డేస్ చిత్రం ప్రారంభo

శ్రీ లత సినీ క్రియేషన్స్ పతాకం పై పి. ఈశ్వర్ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బెక్కం రవీందర్ ప్రొడక్షన్ కంట్రోలర్ గా శ్రీ లత నిర్మిస్తున్న చిత్రం కాలేజ్ డేస్.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ 'జవాన్' మొదటి లుక్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.