close
Choose your channels

రూ.180 కోట్ల బ‌డ్జెట్‌తో రానా చిత్రం?

Wednesday, July 4, 2018 • తెలుగు Comments

రూ.180 కోట్ల బ‌డ్జెట్‌తో రానా చిత్రం?

చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ 'హిర‌ణ్య‌క‌శ్య‌ప' పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రుద్రమ దేవి చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన యువ న‌టుడు దగ్గుబాటి రానా.. ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ సినిమా దాదాపు రూ.180 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం  ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఈ సినిమాకు అవసరమైన ఇంద్రలోకం, వైకుంఠం వంటి సెట్స్ స్కెచెస్ సిద్ధం చేస్తున్నార‌ట‌.

కాగా.. ఈ  సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో ప్రారంభించ‌నున్నారు. బాహుబ‌లి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల‌తో రానా ఫుల్ ఫామ్‌లో ఉన్న నేప‌థ్యంలో.. ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.