రానాకి బీపీ ఎందుకొచ్చిందంటే..?

  • IndiaGlitz, [Saturday,June 02 2018]

'బాహుబ‌లి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' వ‌రుస హిట్ల మీద ఉన్నారు హీరో రానా. మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్న రానా త్వ‌ర‌లో కుడి కంటికి ఆప‌రేష‌న్ చేయించుకోనున్నారు. ఆయ‌న‌కు ఎప్ప‌టి నుంచో కుడి కంటి చూపు స‌రిగా ఉండ‌టం లేదు. ఇదివ‌ర‌కే రానా హైద‌రాబాద్‌లో కుడి కంటికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే అది పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. పైగా ఈ మ‌ధ్య చాలా ఇబ్బంది పెట్ట‌సాగింది. దాంతో అప్ర‌మ‌త్త‌మైన రానా ఇటీవ‌ల త‌న షూటింగ్స్ కి బ్రేక్ తీసుకున్నారు.

ప్రాథ‌మిక ప‌రీక్ష‌లు యు.ఎస్‌.లో చేయించుకున్నారు. అన్నీ చేసిన త‌ర్వాత అక్క‌డి వైద్యులు ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స చేయాల‌ని సూచించార‌ట‌. దీంతో త్వ‌ర‌లో ఆయ‌న‌కు యు.ఎస్‌లో ఆప‌రేష‌న్ చేయ‌నున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని రానా ఉబ‌లాట‌ప‌డుతున్నారు. అయితే ఆయ‌న బీపీ త‌గ్గ‌క‌పోవ‌డంతో వీలుకావ‌డం లేద‌ట‌. రానా అమ్మ త‌ర‌ఫు పెద్ద‌లకు బీపీ ఉంద‌ట‌. అది వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చిందని రానా తండ్రి సురేశ్ బాబు వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం.

More News

సమంత‌కి మూడోసారి కూడా ప్ల‌స్ అవుతుందా?

స‌క్సెస్ రేట్ ఎక్కువ‌గా ఉన్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో స‌మంత మొద‌టి స్థానంలో ఉంటుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

ర‌జ‌నీ, క‌మ‌ల్ చిత్రాల‌కు ప‌వ‌న్ స్వ‌ర‌క‌ర్త‌

తమిళ అనువాద చిత్రం ‘3’తో సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన అనిరుధ్‌..

న్యూక్లియ‌ర్ ప్లాంట్‌లో 'న‌వాబు'

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం పేరు చెప్ప‌గానే హిట్లూ, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా అప‌రిమిత‌మైన క్రేజ్ ధ్వ‌నిస్తుంటుంది.

మురుగ‌దాస్‌, విజ‌య్, కీర్తి సురేష్ మూవీ అప్‌డేట్‌

త‌మిళ అనువాద చిత్రం 'గజని'తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన త‌మిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. ఆ సినిమా త‌రువాత మెగాస్టార్ చిరంజీవితో స్ట్ర‌యిట్ ఫిల్మ్‌ 'స్టాలిన్'

అప్పుడు చిరంత‌న్ భ‌ట్‌.. ఇప్పుడు కీర‌వాణి..

'గమ్యం' సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన క్రిష్ .. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సినిమాలు మాత్రమే చేసారు. క్రిష్ తొలి నాలుగు చిత్రాలను గమనిస్తే..