పురాణ పాత్రలో రానా....

  • IndiaGlitz, [Wednesday,June 21 2017]

ఈ తరం హీరోల్లో దగ్గుబాటి రానా విలక్షణమైన కథలను, పాత్రలను ఎన్నుకుంటూ సాగిపోతున్నాడు. బాహుబలిలో భళ్ళాలదేవగా రానా నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. కెరీర్ ప్రారంభం నుండి ప్ర‌తి పాత్ర, విల‌క్ష‌ణంగా ఉండాల‌నుకునే రానా, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని క‌థ‌ల‌న ఎంపిక చేసుకుంటున్నాడు. అందుకే తెలుగు ప్రేక్ష‌కులకే కాదు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల‌కు కూడా రానా సుప‌రిచితుడే. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇలా భిన్నమైన బాటలో సాగుతున్న రానా, ఓ పౌరాణిక సినిమాలో నటించడానికి అంగీకరించాడని ఫిలింనగర్‌లో వార్తలు వినపడుతున్నాయి.
'రుద్రమదేవి' వంటి చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు గుణశేఖర్‌. ఇప్పుడు 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రంలో టైటిల్‌ పాత్ర కోసం రానాను సంప్రదించాడట. రానా కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఇప్ప‌డు రానా తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో న‌టించాడు. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో రానా ఫైనాన్సియ‌ర్‌, పొలిటీషియ‌న్ జోగింద‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడు. జోగింద‌ర్ భార్య పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

More News

మోడి బయోపిక్ లో అక్షయ్...

ఇప్పుడు బాలీవుడ్లో బయోపిక్ లహవా నడుస్తుంది.

నూతన నటీనటులతో కాలేజీ డేస్ చిత్రం ప్రారంభo

శ్రీ లత సినీ క్రియేషన్స్ పతాకం పై పి. ఈశ్వర్ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బెక్కం రవీందర్ ప్రొడక్షన్ కంట్రోలర్ గా శ్రీ లత నిర్మిస్తున్న చిత్రం కాలేజ్ డేస్.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ 'జవాన్' మొదటి లుక్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఏజంట్ భైరవ' సెన్సార్ పూర్తి

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్ భైరవ'.

ఎంగురి డ్యామ్ లో 'పిఎస్ వి గరుడువేగ 126.18ఎం' షూటింగ్..

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” .