'యన్.టి.ఆర్' బ‌యోపిక్‌లో రానా?

  • IndiaGlitz, [Friday,April 06 2018]

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'యన్.టి.ఆర్'. మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలక వ్యక్తి అయిన‌.. అలాగే అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు పాత్ర కోసం యువ న‌టుడు దగ్గుబాటి రానా పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

గత ఏడాది తేజ దర్శకత్వంలో రూపొందిన 'నేనే రాజు నేనే మంత్రి'లో రాజకీయ నాయకుడు జోగీందర్ పాత్రలో రానా నటన ప్రేక్షకులను, విమ‌ర్శ‌కుల‌ను మెప్పించింది. ఈ నేప‌థ్యంలో..  రానా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలరనీ.. బాలకృష్ణ, తేజ భావిస్తున్నారట.ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపన నుంచి.. ఆయన ఆకస్మిక మరణం తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీని నడిపించ‌డం వ‌ర‌కు సినిమాలో చూపించబోతున్నార‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఇంత‌కుముందు ఈ పాత్ర కోసం  సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పేరు వినిపించింది. అయితే.. రానా ఎంపికనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

More News

600కు పైగా ప్రీమియ‌ర్ షోల‌తో 'కృష్ణార్జున యుద్ధం'

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో రూపొందిన‌ చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలుగా నటించారు.

ఎన్టీఆర్ అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించనున్న‌ చిత్రం 'ఆన్ సైలెంట్ మోడ్' (ప్రచారంలో ఉన్న పేరు). ఈ సినిమాకి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు.

పాటల చిత్రీకరణలో 'నేల టిక్కెట్టు'

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో

డబ్బింగ్ ప్రారంభించిన కీర్తి సురేష్

న‌టీమ‌ణి సావిత్రి బ‌యోపిక్‌గా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

వెంకటేష్‌కే.. ఎందుకిలా?

విజయాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియ‌ర్‌ హీరో విక్ట‌రీ వెంకటేష్.