close
Choose your channels

జూన్‌లో రానా, సాయిప‌ల్ల‌వి 'విరాట ప‌ర్వం'

Wednesday, April 17, 2019 • తెలుగు Comments

జూన్‌లో రానా, సాయిప‌ల్ల‌వి విరాట ప‌ర్వం

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను చేయ‌డంలో ముందుండే న‌టుడే రానా ద‌గ్గుబాటి. తెలుగు, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం రానా, సాయిప‌ల్ల‌వి క‌లిసి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో 'విరాట ప‌ర్వం 1992' సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

ఈ మ‌ధ్య అస‌లు ఈ సినిమా ఉంటుందా?  లేదా? స‌ందేహాలు కూడా వెలువ‌డ్డాయి. అయితే సినిమా ఉంటుంద‌ని..జూన్‌లో ప్రారంభం అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

1992లో పోలీస్‌, న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో రానా పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుంటే.. సాయిప‌ల్ల‌వి న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. 'నీది నాది ఒకే క‌థ' త‌ర్వాత వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మిది. 

Get Breaking News Alerts From IndiaGlitz