Das Ka Dhamki : 'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ సింగిల్ 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' సాంగ్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ

  • IndiaGlitz, [Tuesday,December 06 2022]

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన 'దాస్ కా ధమ్కీ' థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌ లను ప్రారంభించారు.

హిందీ వెర్షన్ ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విశ్వక్ సేన్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌ లు, నివేదా పేతురాజ్ గ్లామ్ టచ్ థియేటర్‌ లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. . లియోన్ జేమ్స్ , ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది. హిందీ వెర్షన్‌కి అమితాబ్ వర్మ సాహిత్యం అందించగా, లియోన్ జేమ్స్‌తో కలిసి నకాష్ అజీజ్ ఆలపించారు.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాస్ కా ధమ్కీ ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్

More News

Premadesam: డిసెంబర్ 9న మళ్లీ థియేటర్స్ లో 'ప్రేమదేశం'

ప్రేమదేశం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు ప్రేక్షకులని

BiggBoss: రేవంత్‌కు ఫస్ట్ ప్లేస్, రోహిత్‌కు ‘‘అన్ డిజర్వ్’’ ట్యాగ్... శ్రీసత్యతో శ్రీహాన్ గొడవ

బిగ్‌బాస్ 6 తెలుగు 13 వారాలు పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది.

Bigg Boss Faima: బిగ్‌బాస్‌లో వున్నందుకు ఫైమా రెమ్యూనరేషన్ ఎంతంటే.. వామ్మో అంత..?

బిగ్‌బాస్ 6 తెలుగు రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. 13 వారాలను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని, 14వ వారంలోకి అడుగుపెట్టింది.

Deepti Sunaina : చీరకట్టులో, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో దీప్తి సునైన ... లేలేత పరువాలతో చెక్కిలిగింతలు

టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునైన.

Connect: నయనతార హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్' ఈ నెల 22న రిలీజ్

నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ "కనెక్ట్" సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.