close
Choose your channels

తండ్రితో సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసిన రానా..!

Monday, October 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 లో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత రానా ఘాజీ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే....రానా సురేష్ ప్రొడ‌క్ష‌న్ లో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు, దీనికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

అయితే...ఈరోజు రానా ఫ‌స్ట్ టైమ్ ఈ ప్రొడ్యూస‌ర్ తో వ‌ర్క్ చేస్తున్నాను. అత‌ను ఎవ‌రో కాదు మా డాడ్ అంటూ సురేష్ బాబుతో క‌లిసి రానా కారులో ఉన్న ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు. అయితే...డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలియ‌చేయ‌నున్నారు. ఈ మూవీ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి...ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.