ఫైనల్ షెడ్యూల్లో రానా ‘విరాట‌ప‌ర్వం’

  • IndiaGlitz, [Wednesday,November 25 2020]

ఆరోగ్య కార‌ణాల రీత్యా సినిమాల‌కు కొన్నిరోజుల పాటు దూరంగా ఉన్న రానా ద‌గ్గుబాటి ఈ ఏడాది క‌రోనా టైమ్‌లో మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రానా ఆరోగ్యం కూడా కుదుట‌ప‌డింది. కోవిడ్ టైమ్ కూడా క‌లిసి రావ‌డంతో రానాకు కావాల్సినంత రెస్ట్ దొరికింది. ఇప్పుడు రానా సెట్స్‌లోకి వ‌చ్చేస్తున్నాడు. వివ‌రాల మేర‌కు రానా హీరోగా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘విరాట‌ప‌ర్వం’ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ సినిమా షూటింగ్ వికారాబాద్ అడ‌వుల్లో ప్రారంభ‌మైంది. షూటింగ్‌కు ముందు చిత్ర‌యూనిట్ కోవిడ్ సంబంధిత ప‌రీక్ష‌లు చేసి, దానికి త‌గిన‌ట్లు జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఎంటైర్ యూనిట్ కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్త‌వు‌తుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి లుక్‌తో పాటు న‌క్స‌లైజ్ భార‌త‌క్క‌గా న‌టిస్తున్న ప్రియ‌మ‌ణి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రానా లుక్ కూడా విడుద‌లైంది కానీ.. ఆయ‌న పాత్ర‌కు సంబంధించి ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రానా పోలీస్ ఆఫీస‌ర్ అని, రాజ‌కీయ నాయ‌కుడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరితో పాటు సురేశ్‌బాబు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇంకా జ‌రీనా వ‌హాబ్‌‌, నందితాదాస్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.