రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తానంటోన్న రానా !!

  • IndiaGlitz, [Friday,April 10 2020]

రానా ద‌గ్గుబాటి హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా రాణిస్తున్నారు. ఇటీవ‌ల కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రానా అనారోగ్య స‌మ‌స్య‌లే అందుకు కార‌ణమ‌ని వార్త‌లు కూడా విన‌ప‌డ్డాయి. ఈ గ్యాప్ త‌ర్వాత రానా వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఆయ‌న న‌టించిన ఆర‌ణ్య ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా ఆగింది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత ఆర‌ణ్య విడుద‌ల తేదీ ఖ‌రార‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఇది కాకుండా తెలుగులో విరాట‌ప‌ర్వం సినిమాను రానా చేస్తున్నారు. అలాగే మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్ రీమేక్‌లోనూ రానా పేరు ప్ర‌ముఖంగా క‌న‌ప‌డుతుంది. అయితే రీసెంట్‌ ఓ అభిమాని ట్విట్ట‌ర్‌లో రానాను ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌డం చూడాల‌నుంద‌ని కోరాడు. దానికి రానా వెంట‌నే రియాక్ట్ అయ్యారు. త్వ‌ర‌లోనే తాను రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించబోతున్నాన‌ని, ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పుకొచ్చారు. నటుడిగానే కాకుండా రానా నిర్మాత‌గానూ బిజీ అవుతున్నారు. ఈయ‌న నిర్మాణంలో కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లు రూపొంద‌నున్నాయి. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత క్ర‌మంగా వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

More News

అందుకే సినిమాల‌కు దూర‌మ‌య్యానంటున్న శ్రీముఖి

బుల్లితెర‌, వెండితెర‌కు ఒక‌ప్పుడు దూరం ఎక్కువ‌గా ఉండేది. వెండితెర‌పై డీగ్లామ‌ర్ అయిన వారే బుల్లి తెర‌పై క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపేవారు.

క‌రోనాపై పోరుకు మ‌హేశ్ కొత్త ఆలోచ‌న‌..!!

కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయింది. అన్నీ రంగాలు స్తబ్దుగా అయిపోవడం అభివృద్ధి ఆగిపోయింది. ఉన్న‌త, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం

నర్సింగ్‌ యాదవ్‌ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ ఏపీలో పరీక్షలు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా... వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని

‘రేపట్నుంచి తెలంగాణలో కరోనా కేసులుండవేమో!’

రేపట్నుంచి అనగా శుక్రవారం నుంచి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఉండకపోవచ్చేమోనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.