రానా పెళ్లి వేదిక ఇదేనా..!
- IndiaGlitz, [Saturday,June 20 2020]
సినీ పరిశ్రమలో దగ్గుబాటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరి మూడోతరంగా సినీ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా దగ్గుబాటి. ఈ పాన్ ఇండియా నటుడు, మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇటీవల రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌కు రోకా కూడా జరిగింది. రానా, మిహీకల మ్యారేజ్ ఆగస్ట్ 8న హైదరాబాద్‌లో జరుగుతుందని సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ సమాచారం మేరకు వీరి పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుందని సమాచారం.
కరోనా ప్రభావంతో పెద్ద సంఖ్యలో జనాలెవరూ పెళ్లికి హాజరు కాకూడదని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈ తరుణంలో ఇంత పెద్ద ప్యాలెస్‌లో రానా, మిహీక బజాజ్‌ల పెళ్లి జరుగుతుందా? అనేది కూడా ఆలోచించాలి. అతి కొద్ది మంది పెళ్లిళ్లు మాత్రమే ఫలక్ నుమా ప్యాలెస్‌లో జరుగుతాయి. ఇప్పుడు తెలుగు సినీ సెలబ్రిటీల్లో రానా పెళ్లి ఫలక్ నుమా ప్యాలెస్‌లో జరనుందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే రానా హీరోగా నటించిన అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. మరో పక్క సాయిపల్లవితో కలిసి విరాటపర్వం చిత్రంలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.