రానా పెళ్లి వేదిక ఇదేనా..!

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి. ఈ పాన్ ఇండియా న‌టుడు, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌కు రోకా కూడా జ‌రిగింది. రానా, మిహీకల మ్యారేజ్‌ ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో జ‌రుగుతుందని సురేష్ బాబు క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు వీరి పెళ్లి హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

క‌రోనా ప్ర‌భావంతో పెద్ద సంఖ్య‌లో జ‌నాలెవ‌రూ పెళ్లికి హాజ‌రు కాకూడ‌ద‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. ఈ త‌రుణంలో ఇంత పెద్ద ప్యాలెస్‌లో రానా, మిహీక బ‌జాజ్‌ల పెళ్లి జ‌రుగుతుందా? అనేది కూడా ఆలోచించాలి. అతి కొద్ది మంది పెళ్లిళ్లు మాత్ర‌మే ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో జ‌రుగుతాయి. ఇప్పుడు తెలుగు సినీ సెల‌బ్రిటీల్లో రానా పెళ్లి ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో జ‌ర‌నుంద‌ని స‌మాచారం. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రానా హీరోగా న‌టించిన అర‌ణ్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రో ప‌క్క సాయిప‌ల్ల‌వితో క‌లిసి విరాట‌ప‌ర్వం చిత్రంలో రానా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

నాగార్జునతో గోవా బ్యూటీ..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఇది తాగితే 5 రోజుల్లో కరోనా ఖేల్ ఖతం!

‘కబాసుర కుడినీర్’ గురించి తెలుసా? ఇది తాగితే ఐదు రోజుల్లో కరోనా ఖేల్ ఖతమైపోతుంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు..

మార్పులేం లేవంటున్న ఛార్మి

‘స్క్రిప్టులో మార్పులా అలాంటి దేమీ లేదు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఫైటర్ బ్లాక్ బస్టర్ స్ర్కిప్ట్.

కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగు పెట్టింది: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయేత కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.