రంగం రేంజ్ లో విజయం సాధించే రంగం-2 -'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేం కళ్యాణ్ కృష్ణ

  • IndiaGlitz, [Saturday,October 15 2016]

జీవా-తులసీనాయర్‌ జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగం 2. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో' శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ ఎన్‌.బాలాజి (సూపర్‌గుడ్‌ బాలాజి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హ్యారిస్‌ జైరాజ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన రంగం-2' చిత్రం ఫస్ట్‌ లుక్ ను సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కళ్యాణ్‌కృష్ణ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ...జీవా హీరోగా సినిమాటోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన రంగం ఎంతటి సంచలన విజయం సాధించిందో.. దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్‌ రవి.కె.చంద్రన్‌ దర్శకత్వం వహించిన రంగం-2' చిత్రం కూడా అంతటి ఘన విజయం సాధించడం ఖాయం. రవి.కె.చంద్రన్‌- హ్యారిస్‌ జైరాజ్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్ వ‌ర్క్ చేసిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో రంగం-2' పేరుతో వస్తున్న ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయం సాధించాలని, నిర్మాతగా ఎ.ఎన్‌.బాలాజీకి (సూపర్‌గుడ్‌ బాలాజీ) మంచి పునాది కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
విడుదల చేసిన మూడు రోజుల్లోనే మూడున్నర లక్షల వ్యూస్‌ రావడం బట్టి రంగం-2' చిత్రానికి గల క్రేజ్‌ అర్ధమవుతుందని కె.వి.వి.వేణు అన్నారు.
రంగం-2' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం ఎంతో గర్వంగా ఉందని నిర్మాత ఎ ఎన్‌.బాలాజీ (సూపర్‌ గుడ్‌ బాలాజీ) తెలిపారు.
నాజర్‌, జయప్రకాష్‌, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, కెమెరా: మానుష్‌ నందన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌, సమర్పణ: జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, నిర్మాత: ఎ ఎన్‌.బాలాజీ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్‌

More News

నందినీ న‌ర్సింగ్ హోమ్ సెన్సార్ పూర్తి..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి - 2 మిలియ‌న్ హిట్స్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ భారీ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్..!

రేయ్,పిల్లానువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్,సుప్రీమ్ చిత్రాలతో సక్సెస్ సాధించిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.

పూరి ఇజం రన్ టైమ్..!

డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.

చ‌ర‌ణ్ ఫ్యామిలీలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేపు న్యూజెర్సీ లో జ‌ర‌గ‌నున్న‌  హ్యుమానిటి యునైటెడ్ ఎగినెస్ట్ టెర్ర‌ర్ అనే కార్య‌క్ర‌మంలో లైవ్ పెర్ ఫార్మెన్స్ చేయాల్సిఉంది.