ఒక్క‌టైనా ర‌ణ‌వీర్‌, దీపిక‌

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

బాలీవుడ్ స్టార్స్ ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనెల వివాహం ఇట‌లీలోని లేక్ కోమోలో జ‌రిగింది. ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన వీరి పెళ్లి తంతు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగిసింద‌ట‌. ర‌ణ‌వీణ్ త‌న బృందంతో సీ ప్లేన్‌తో వేడుక‌కు వ‌చ్చాడ‌ట‌.

ఈరోజు కొంక‌ణి సంప్ర‌దాయంలో పెళ్లి అట్ట‌హాసంగా జ‌రిగింది. రేపు సింధి సంప్ర‌దాయంలో జ‌ర‌గ‌నుంద‌ట‌. ర‌ణ‌వీర్ మోకాలిపై కూర్చుని దీపికాకు మెట్టెలు తొడిగేట‌ప్పుడు దీపికా ఉద్వేగానికి లోన‌య్యార‌ట‌. ర‌ణ‌వీర్ ఆమెను బుజ్జిగించిన‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

స‌వ్య‌సాచి డిజైన్ చేసిన చీర‌ను దీపికా ప‌దుకొనె వివాహంలో ధ‌రించార‌ట‌. భారీ సెక్యూరిటీ మ‌ధ్య జ‌రిగిన ఈ వివాహానికి అతిథులు పెళ్లికి శుభ‌లేఖలు తీసుకు రావాల‌ని, రిస్ట్ బాండ్స్ ధ‌రించాల‌నేది నిబంధన పెట్టార‌ట‌.

More News

శ్రీ కృష్ణ క్రియేషన్స్ విడుదల చేస్తున్న 'నెక్ట్స్ ఏంటి'

యూత్ లో తమన్నా గ్లామర్ కున్న ఫాలోయింగ్ గురించి  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువ హీరోల్లో మంచి సక్సెస్ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు.

అర్జున్ పెట్టిన కేసును ర‌ద్దు చేయాల‌న్నశృతి

ప్ర‌స్తుతం దేశంలోని హాట్ టాపిక్స్‌లో మీ టూ ఉద్య‌మం ఒక‌టి. ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు ఈ ఉద్య‌మంలో లైంగిక ఆరోప‌ణ‌లను ఎదుర్కొన్న‌వారే.

'ఇండియ‌న్ 2' లో మ‌రో యువ న‌టుడు

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రో బాలీవుడ్ చిత్రంలో...

ప్ర‌స్తుతం త‌మిళంలో సూర్య‌తో ఎన్‌.జి.కె, కార్తితో దేవ్ చిత్రాలు చేస్తుంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ రెండు చిత్రాలు త‌ర్వ‌లోనే విడుదల కాబోతున్నాయి.

రాజ‌కీయాల గురించి రామ్ కామెంట్‌

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. రాజ‌కీయ పార్టీలన్నీ ప్ర‌జ‌ల్ని త‌మ వైపు తిప్పుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.