పార్టీ ముఖ్య సమావేశంలో పవన్.. ఎడ్ల పందాల్లో రాపాక

  • IndiaGlitz, [Saturday,January 11 2020]

అవును.. జనసేన పార్టీకి సంబంధించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బిజిబిజీగా ఉంటే.. ఆ పార్టీకి చెందిన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఎడ్ల పందాల పోటీల్లో బిజిబిజీగా ఉన్నారు. అది కూడా ఏపీ మంత్రి కొడాలి నానితో కలిసి ఉండటం గమనార్హం. ఈ ఘటనతో పార్టీ నేతలు, కార్యకర్తలు, రాపాక అండ్ పవన్ ఫ్యాన్స్ కంగుతిన్నారు. ఓ వైపు పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశం జరుగుతుంటే హాజరుకాకుండా గైర్హాజరైన రాపాక ఎడ్లపందాలకు వెళ్లడంతో మరోసారి ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు.

అక్కడ మీటింగ్.. ఇక్కడ పందాలు!
ఇవాళ.. పార్టీకి చెందిన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమై రాజధాని వివాదం, స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. అయితే ఇలాంటి సమావేశానికి ఆయన హాజరుకాకపోవడం గమనార్హం. అయితే ఇలా పవన్‌కు షాకులివ్వడం ఇదేం మొదటి సారి కాదు.. ఎన్నో సారో రాపాకే తెలియాల్సి ఉంది. అయితే ఇలా మీటింగ్‌కు హాజరుకాకపోగా మీరేంటి అక్కడ సమావేశం జరుగుతుంటే ఇక్కడున్నారు..? అని మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఎప్పుడూ చూడ్లే అందుకే!
‘ఇప్పటివరకూ నేను ఎడ్లపందాలు ఎక్కడా చూడలేదు. అందుకే గుడివాడకు వచ్చాను. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదే అని నేను అనుకుంటున్నాను. రాజధాని రైతులు ధర్నాలు చేయడం కంటే సీఎం జగన్‌ను వచ్చి కలిస్తే మంచిది. జనసేనలో నా అభిప్రాయాన్ని స్వతంత్రంగా చెబుతాన్నాను’ అని రాపాక చెప్పారు. అయితే కొడాలి ఎడ్ల పందాలు ఆడుతున్నప్పుడు ఆయన పక్కనే రాపాక ఉండటం.. ఏకైక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మంత్రి కొడాలి ఆయన పక్కనే ఉండటాన్ని చూసిన పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాగా.. ఇలా పవన్ కల్యాణ్‌కు రాపాక షాకులివ్వడం ఇదేం మొదటిసారి కాదు. అయితే తాజా వ్యవహారంపై పవన్ కల్యాణ్.. పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More News

ఫిబ్రవరి 21 న 'రాహు' రిలీజ్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మనసులను కదిలిస్తున్న పూజా హెగ్డే మాటలు

ఆస్ట్రేలియా అడవుల్లోని కార్చిచ్చు.. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.

ప్రభాస్‌తో త్రివిక్రమ్.. చర్చలు షురూ!

టాప్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

చిరు ఫోన్ కోసం వెయిటింగ్.. నాన్నకు చెప్పా!!

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

రక్తం ఉడిపోతోంది.. 25 కుర్రాడిలానే.. : చంద్రబాబు

వైసీపీ పాలన చూస్తుంటే రక్తం ఉడికిపోతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.