close
Choose your channels

ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంవోలో నియామకం..

Sunday, September 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంవోలో నియామకం..

యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి అరుదైన అవకాశం దక్కింది. కేబినెట్ సెక్రటేరియల్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ఆమ్రపాలి.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్‌మెంట్స కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి స్వస్థలం విశాఖపట్టణం. చెన్నై ఐఐటీ నుంచి బీటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

2010లో సివిల్స్ రాసిన ఆమ్రపాలి ఆలిండియా 39వ ర్యాంకును సాధించారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించారు. వికారాబాద్ సబ్-కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ కలెక్టర్‌గా, తెలంగాణ ఎన్నిక సంఘం అధికారిణిగా సేవలందించారు. అలాంటి ఆమ్రపాలి పీఎంవోలో నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకున్నారు. పీఎంలో డైరెక్టర్‌గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌తో పాటు డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రపాలి నియమితులయ్ాయరు. ఆమె 2023 ఆక్టోబర్ 27 వరకూ డిప్యూటీ కార్యదర్శిగా కొనసాగనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.