ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంవోలో నియామకం..

  • IndiaGlitz, [Sunday,September 13 2020]

యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి అరుదైన అవకాశం దక్కింది. కేబినెట్ సెక్రటేరియల్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ఆమ్రపాలి.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్‌మెంట్స కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి స్వస్థలం విశాఖపట్టణం. చెన్నై ఐఐటీ నుంచి బీటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

2010లో సివిల్స్ రాసిన ఆమ్రపాలి ఆలిండియా 39వ ర్యాంకును సాధించారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించారు. వికారాబాద్ సబ్-కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ కలెక్టర్‌గా, తెలంగాణ ఎన్నిక సంఘం అధికారిణిగా సేవలందించారు. అలాంటి ఆమ్రపాలి పీఎంవోలో నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకున్నారు. పీఎంలో డైరెక్టర్‌గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌తో పాటు డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రపాలి నియమితులయ్ాయరు. ఆమె 2023 ఆక్టోబర్ 27 వరకూ డిప్యూటీ కార్యదర్శిగా కొనసాగనున్నారు.

More News

కరోనాని మించిన మహమ్మారి ముందుంది...

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. సామాన్య ప్రజలు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుక్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విజయ్ దేవరకొండ పేరుతో మోసం...

సినీ ఇండస్ట్రీని ఉపయోగించుకుంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగు చూశాయి.

బిగ్‌బాస్ నుంచి డైరెక్టర్ అవుట్.. గేమ్ ఆడటానికెళ్లి రచ్చబండ కబుర్లా..

బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఒక్క వారంలోనే ఆయన అంతులేని నెగిటివిటీని సంపాదించుకున్నారు.

స్మార్ట్‌గా కడిగిపారేసిన నాగ్.. కట్టప్ప ఎవరో చెప్పేశారు..

‘బాహుబలి’ టైటిల్ సాంగ్‌తో కింగ్ నాగార్జున ఎంట్రీ షోకే హైలైట్. బిగ్‌బాస్ షోలో కట్టప్ప ఎవరో తేల్చేద్దామంటూ ఆదిలోనే అదరగొట్టేశారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభం

ఇటీవల ఆగిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభమయ్యాయి.