close
Choose your channels

ర‌ష్మీ స్థానంలో....

Thursday, October 12, 2017 • తెలుగు Comments

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌లో హాట్ హాట్‌గా మెప్పించిన యాంక‌ర్ అన‌సూయ త‌ర్వాత, ఆ స్థానంలోకి వ‌చ్చిన ర‌ష్మీ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అయితే ఇప్పుడు ర‌ష్మీ స్థానంలో రియాలిటీ షోలో పాల్గొన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హ‌రితేజ జ‌బ‌ర్‌ద‌స్త్‌కు యాంక‌రింగ్ చేయ‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అయితే బిగ్ బాస్ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఇందులో ర‌ష్మీ, ఒక  కంటెస్టెంట్‌గా పాల్గొన‌బోతుంద‌ని, అందువ‌ల్ల‌నే జ‌బ‌ర్‌ద‌స్త్ నుండి విరామం తీసుకోనుంద‌ని మ‌రికొంద‌రంటున్నారు.

బిగ్‌బాస్ ఫైన‌ల్‌కు చేరిన కంటెస్టెంట్స్‌లో హ‌రితేజ కూడా ఉంది. ఒకానొక సంద‌ర్బంలో హ‌రితేజ గెలిచే అవ‌కాశం ఉంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే చివ‌ర‌కు శివబాలాజీ గెలిచాడ‌నుకోండి. అయితే హ‌రితేజ చాలా మంది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఒక‌వేళ ఇప్పుడు హ‌రితేజ..జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ర‌ష్మీని రీప్లేస్ చేస్తే హాట్‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.