'తను వచ్చెనంట' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యబాలకృష్ణన్ హీరో,హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం 'తను వచ్చెనంట'. అచ్యుత్ ఆర్ట్స్ బ్యానర్‌పై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహించారు. శరవేగంగా నిర్మాణాంతర కార్యక్ర మాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు.

లవ్ స్టోరితో పాటు హర్రర్, కామెడీ చిత్రాల హవా నడుస్తున్న ఈ తరుణంలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం వినూత్న ప్రయత్నంగా జోమెడీ జోనర్‌లో రూపొం దించిన చిత్ర మిది. సినిమా పోస్టర్స్ నుండి ట్రైలర్ వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని యూనిట్ చాలాి కాన్ఫిడెంట్ గా ఉంది. .

More News

చిరు 150వ చిత్రం కోసం ఇండియాలో ఆరు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఖైదీ నెం 150వ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

చిరు మూవీలో క్యాథరిన్ ఔట్..రాయ్ ఇన్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ప్రెస్టిజియస్ 150 మూవీ `ఖైదీ నంబర్ 150`. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సిద్ధార్థ డైరెక్ట‌ర్‌తో నాని

సిద్దార్థ‌, శృతిహాస‌న్‌, హ‌న్సిక‌ల‌తో రూపొందిన సినిమా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించాడు.

బాలీవుడ్ రీమేక్‌లో త్రిష‌

త్రిష త‌మిళంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ధ‌నుష్ స‌ర‌స‌న కొడి(తెలుగులో ధ‌ర్మ‌యోగి) సినిమాలో నెగ‌టివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించింది.

ర‌కుల్ త‌ప్పుకుంది

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకెళుతుంది. ఇప్పుడు త‌మిళంలో కూడా అడుగుపెట్టింది. విశాల్ హీరోగా మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తుప్ప‌రివాల‌న్ చిత్రంలో ముందుగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.