close
Choose your channels

ఆ క్రెడిట్ నాది కాదు.. మొత్తం విజయ్, డైరెక్టర్‌దే!! - రష్మిక

Tuesday, July 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ క్రెడిట్ నాది కాదు.. మొత్తం విజయ్, డైరెక్టర్‌దే!! - రష్మిక

టాలీవుడ్‌లో వరుస హిట్‌లతో దూసుకెళ్తున్న కుర్ర హీరో కమ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మికా మందన్నా నటీనటులుగా భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్‌’. రెండోసారి నటిస్తున్న విజయ్-రష్మికా కాంబోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందుకు కారణం ‘గీత గోవిందం’ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యి.. బాక్సాఫీస్‌ను షేక్ చేయడమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే బాటలోనే ‘డియర్ కామ్రేడ్’ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అంచాలున్నాయి. జులై-26న ‘డియర్ కామ్రేడ్‌’ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు.

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం చాలా వెరైటీగా చేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటికే మ్యూజిక్ ఫెస్టివల్ అంటూ చెన్నై, బెంగళూరు.. త్వరలో హైదరాబాద్ ఇలా వరుసగా ఈవెంట్లతో దూసుకెళ్తోంది చిత్రబృందం. ఇక తాజాగా.. ప్రమోషన్లలో భాగంగా రష్మిక మీడియాతో ముచ్చటించి సినిమాకు, ‘డియర్ కామ్రేడ్‌’లో తన పాత్ర, విజయ్ పాత్ర గురించి దాదాపు అన్ని విషయాలను రివీల్ చేసేసింది. అంతేకాదు.. త్వరలో నటించబోయే సినిమాలు గురించి.. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి కూడా చెప్పుకొచ్చింది.

‘డియర్ కామ్రేడ్‌’ గురించి మూడు ముక్కల్లో..!

"‘డియర్ కామ్రేడ్’ భావోద్వేగాలతో సాగే ఒక ఎమోషనల్ సినిమా. సినిమాలోని ఎమోషన్ మరియు మెసేజ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇందులో నా క్యారెక్టర్.. విజయ్ క్యారెక్టర్.. మా ఇద్దరి మధ్య జర్నీ సినిమాలో హైలెట్‌గా నిలువనుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఈ సినిమాలో నేను ‘లిల్లీ’ అనే స్టేట్ లెవల్ క్రికెటర్ పాత్రలో నటించాను. బాబీ (విజయ్) అనే అతనితో ప్రేమలో పడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి..? బాబీతో నా లైఫ్ అండ్ లవ్ జర్నీ ఎలా సాగింది..? అనేదే సినిమా" అని ఈ బ్యూటీ చెప్పింది.

నాకు అస్సలు తెలియాదు బాబోయ్!

"నేను ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో నటించానే తప్ప.. వాస్తవానికి క్రికెట్ గురించి నాకేమీ తెలియదు. ఈ సినిమాలో ‘లిల్లీ’ పాత్రకోసమే క్రికెట్ అంటే ఏంటి..? అనే బేసిక్స్ మాత్రమే నేర్చుకున్నాను. కాస్త క్రికెట్ గురించి తెలుసుకున్నాక నా వికెట్ పడకుండా మ్యానేజ్ చెయ్యగలను (నవ్వుతూ...). ఇప్పటి వరకూ చాలాసార్లు ఫోర్‌లు మాత్రమే కొట్టానంతే.. కానీ సిక్స్‌లు కొట్టమంటే కష్టం. ఇక డబ్బింగ్ విషయానికొస్తే.. కన్నడ, తెలుగులో మాత్రమే నేను డబ్బింగ్ చెప్పాను. మిగతా భాషల్లో వేరేవాళ్లు చెప్పారు" అని మందన్నా ఆసక్తికర విషయాలు పంచుకుంది.

సినిమా ఎవరి కోసం ఒప్పుకున్నారు!?.. క్రెడిట్ ఎవరిది!

"నేను విజయ్ కోసం సినిమా ఒప్పుకోలేదు. ఎవరి కోసం నేను సినిమా ఒప్పుకోలేదు. డైరెక్టర్ భరత్‌కు స్క్రిప్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంది. నాకు మొదట స్క్రిప్ట్ మొత్తం మెయిల్ చేశారు.. కానీ నేను చదవలేదు.. చదవలేకపోయాను. ఆ తర్వాత భరత్ సార్ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.. మొదటిసారి విన్నాకే ఆలస్యం చేయకుండానే ఓకే చెప్పేశాను.

స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు బాగా నచ్చిందంతే. స్టోరీ బాగా ఇంట్రస్టింగ్‌గా ఉంది. అందుకే సినిమా చెయ్యడానికి అంగీకరించాను. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా భిన్నంగా.. బాగున్నాయని చాలా మంది అంటున్నారు. ఏదేమైనా సినిమాకు ప్రమోషన్స్ అనేవి మెయిన్ కదా. అయితే ఆ కొత్త ఐడియా మాత్రం నాది కాదు..ఆ క్రెడిట్ మొత్తం విజయ్, డైరెక్టర్ ఇవ్వాలి. ఈ ఇద్దరిదే ప్రమోషన్స్ ప్లాన్. నేను సినిమాలో హీరోయిన్‌గా ప్రమోషన్స్ పాల్గొనాలి కాబట్టి ఈవెంట్‌లకు వెళ్తున్నాను" అని రష్మిక చెప్పుకొచ్చింది.

‘గీత గోవిందం’ సినిమాతో తన గీత మార్చుకున్న రష్మికకు.. ‘డియర్ కామ్రేడ్’ ఏ మాత్రం కలిసొస్తుందో.. సక్సెస్ బాటలో నడిపిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 26వరకు మొదటి షో పడే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.