close
Choose your channels

విజయ్‌తో డేటింగ్‌పై రష్మిక క్లారిటీ

Saturday, August 17, 2019 • తెలుగు Comments

విజయ్‌తో డేటింగ్‌పై రష్మిక క్లారిటీ

సినీ ఇండస్ట్రీలో నటీనటులపై వార్తలకు కొదువ ఉండదు. ఏమీ లేకపోయినా వార్తలే.. అన్నీ ఉన్నా వార్తలే.. అది రీల్ అయినా రియల్‌లో అయినా పరిస్థితి అదీ. కొందరైతే హీరో హీరోయిన్లకు సంబంధాలు అంటగట్లేసి మరీ కథనాలు పుట్టిస్తుంటారు. అయితే ఇలాంటివన్నీ నటీనటులకు మామూలే.. పెద్దగా ఎవరూ ఇలాంటి పుకార్లను, వార్తలు రాసేవారిని అస్సలు పట్టించుకోరు. మరికొంత నటీనటులైతే పుకార్లు వస్తే చాలు గంటల వ్యవధిలోనే దుమ్ముదులిపి వదులుతుంటారు.

అయితే గత కొన్ని రోజులుగా.. మరీ ముఖ్యంగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై ఇప్పటికే ఎన్ని వార్తలు వచ్చాయో.. కొత్తగా చెప్పనక్కర్లేదు. వీళ్లు చేసింది రెండు సినిమాలు అయినా ఒకరికొకరు దగ్గరయ్యారని ప్రేమించుకుంటున్నారని..? అంతేకాదు డేటింగ్‌లో ఉన్నారంటూ కూడా కథనాలు పుట్టించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆల్రెడీ సెట్ అయిన రష్మిక పెళ్లికి కూడా విజయ్ అడ్డుపడ్డాడని అందుకే ఆ పెళ్లి రద్దు అయ్యిందని అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లన్నింటికీ ఇప్పటికే విజయ్, రష్మిక స్పందించి క్లారిటీ ఇచ్చారు కూడా.. అయినప్పటికీ ఇలాంటి వార్తలపై స్పందించినప్పటికీ ఆగట్లేదు.

క్లారిటీ ఇచ్చిన రష్మిక..

‘విజయ్ దేవరకొండ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నట్లగా ఏమీలేదు.. ఫ్రెండ్స్ మాత్రమే. అంతకు మించి మా ఇద్దరి మధ్య మరేం లేదు’ అని తేల్చిచెప్పింది.  ఓ ఇంటర్వ్యూలో..  విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు రష్మిక పై విధంగా స్పందించింది. కాగా రష్మిక ప్రస్తుతం సూసర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే.

Get Breaking News Alerts From IndiaGlitz