హీరోయిన్‌గా ఫామ్‌లోనే వున్నావుగా.. ఈ కక్కుర్తి ఎందుకు: రష్మిక యాడ్‌పై నెట్టింట ట్రోల్స్

  • IndiaGlitz, [Friday,October 01 2021]

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ‘ఛలో..’ అంటూ టాలీవుడ్‌కు వచ్చి.. ‘గీతగోవిందం’తో గిలిగింతలు పెట్టి.. ‘దేవదాస్‌’లా మారకండని చెప్పి ప్రశ్నించే వాడే ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటూ ‘భీష్మ’తో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న రష్మిక మందన్నా ఇప్పుడో వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ర‌ష్మిక చేసిన ఓ యాడ్ తో ట్రోల్స్ కు గుర‌వుతోంది. బాలీవుడ్ న‌డుడు విక్కీ కౌష‌ల్ తో క‌లిసి రష్మిక ఓ అండ‌ర్ వేర్ యాడ్ లో న‌టించింది. ఈ యాడ్ లో ర‌ష్మిక ఫిట్నెస్ ట్రైన‌ర్ గా క‌నిపిస్తోంది.

విక్కీ కౌష‌ల్.. ర‌ష్మిక ద‌గ్గ‌ర కోచింగ్ కు వ‌చ్చే యువ‌కుడిగా క‌నిపిస్తున్నాడు. అయితే ఈ యాడ్ లో విక్కీ కౌశ‌ల్ కసరత్తులు చేస్తుండ‌గా అత‌డి టీష‌ర్ట్ పైకి లేవ‌డంతో అత‌డి అండ‌ర్ వేర్ ప‌ట్టీ పై ర‌ష్మిక క‌న్ను ప‌డుతుంది. దాంతో ర‌ష్మిక రొమాంటిక్ లుక్ ఇస్తుంది. ఈ యాడ్ పై నెటిజన్ల నుంచి ఫుల్ గా ట్రోల్స్ వ‌స్తున్నాయి. చేతినిండా సినిమాలు ఉన్న సమయంలో ఈ ఛీప్ యాడ్స్ ఎందుకు అంటూ క‌న్న‌డ బ్యూటీని నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారు. ఇలాంటి యాడ్లు చేసేముందు ఆలోచించుకోవద్దా.. దయచేసి ఇలాంటి యాడ్లు మళ్ళీ చేయద్దని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు మహిళా సంఘాల నుంచి కూడా రష్మికకి గట్టి విమర్శలు ఎదురౌతున్నాయి. ఒక అమ్మాయి అబ్బాయి అండర్ వేర్ వంక అంత ఆబగా చూస్తుందా ? నిజ జీవితంలో ఒక అమ్మాయి, అబ్బాయి అండర్ వేర్ చూసి మైకంలో మునుగుతుందా? ఇలాంటి ప్రకటనల ద్వారా మహిళలని ఎలా చిత్రీకరించాలని భావిస్తున్నారు ? అంటూ మండిపడుతున్నారు.