close
Choose your channels

‘హీ ఈజ్ సో క్యూట్’.. మహేశ్‌పై రష్మిక టిక్ టాక్ వీడియో

Friday, December 13, 2019 • తెలుగు Comments

‘హీ ఈజ్ సో క్యూట్’.. మహేశ్‌పై రష్మిక టిక్ టాక్ వీడియో

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్‌ను పెద్దగా పట్టించుకోని చిత్రబృందం రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో ప్రతి సోమవారం ఒక్క సాంగ్.. అప్పుడప్పుడూ చిన్నపాటి లుక్స్ అంటూ చిత్రబృందం రిలీజ్ చేస్తోంది.

అయితే ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన లుక్స్‌లో కానీ.. సాంగ్స్‌లో కానీ.. హీరోయిన్ రష్మిక మందన్నా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అసలు హీరోయిన్ పాత్ర ఉందా లేదా..? ఒక వేళ ఉన్నా చాలా తక్కువగా ఉందేమో..? అని ఇలా పలురకాలుగా మహేశ్ అభిమానులు నెట్టింట్లో అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తన పాత్ర గురించి ఎందుకు రివీల్ చేయలేదని ఒకానొక సందర్భంలో రష్మిక కూడా అసంతృప్తికి లోనైందని వార్తలూ వచ్చాయి.

రష్మిక కనపడిందహో!
ప్రతి సోమవారం ఒక్క సాంగ్‌ అని టార్గెట్‌గా పెట్టుకున్న చిత్రబృందం తాజాగా మరో సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో ‘హీ ఈజ్ సో క్యూట్’ అంటూ సాగుతుంది. అయితే ఈ ప్రోమోను కాస్త వెరైటీగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు హీరోయిన్ రష్మిక మందన్న డాన్స్ చేస్తున్న వీడియోను టిక్ టాక్‌లో విడుదల చేసింది. అంటే ఇప్పటి వరకూ సోషల్ మీడియాను ఎడాపెడా వాడేసి.. ఇప్పుడు సరికొత్తగా టిక్‌టాక్‌లో అడుగుపెట్టారన్న మాట.

కాగా.. ‘హీ ఈజ్ సో క్యూట్’ పాటకు రష్మిక మందన్నా అద్దిరిపోయే స్టెప్పులేసి తన అభిమానులతో పాటు మహేశ్ ఫ్యాన్స్‌ను కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఆమె డ్యాన్స్‌ చూసి మహేష్ వీరాభిమానులు ఫిదా అయిపోయి తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సాంగ్‌ను సోమవారం అనగా.. డిసెంబరు 16 సాయంత్రం 05:04 గంటలకు రిలీజ్ చేయబోతోంది. ఇప్పటి వరకూ అన్ని సాంగ్స్ సినీ ప్రియులను చాలా బాగా ఆకట్టుకున్నాయ్.. యూ ట్యూబ్‌లోనూ బాగా ట్రెండ్ అవుతున్నాయ్. ఇక్కడ హీ.. అంటే మహేశ్ అన్న మాట. వాస్తవానికి మహేశ్ అందం గురించి రీల్‌లోనే కాదు.. రియల్‌గాను ఎవరూ సరిపోరు.. ఒక్క మాటలో చెప్పాలంటే అందంలో మహేశ్‌కు సరిలేరు ఎవ్వరూ..!

Get Breaking News Alerts From IndiaGlitz