ర‌త్న‌వేలు `మెగా` హ్యాట్రిక్‌

  • IndiaGlitz, [Sunday,October 06 2019]

సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్‌. ర‌త్న‌వేలు ప‌నిత‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 'ఆర్య‌' (2004) నుంచి 'సైరా.. న‌ర‌సింహారెడ్డి' (2019) వ‌ర‌కు అత‌ని కెమెరాలో బంధించ‌బ‌డ్డ ప్ర‌తీ తెలుగు సినిమా.. ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ర‌త్న‌వేలులోని సాంకేతిక నిపుణుడ్ని హైలైట్ చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే.. ర‌త్న‌వేలు ఇప్ప‌టివ‌ర‌కు మెగాఫ్యామిలీలో నాలుగు చిత్రాల‌కు ప‌నిచేయ‌గా.. అన్నీ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. 'ఆర్య‌', 'ఖైదీ నంబ‌ర్ 150', 'రంగ‌స్థ‌లం', 'సైరా న‌ర‌సింహారెడ్డి'.. ఇలా మెగా కాంపౌండ్ క‌థానాయ‌కులు న‌టించిన ఈ నాలుగు చిత్రాల‌కూ ర‌త్న‌వేలు కెమెరా వ‌ర్క్ ఎస్సెట్‌గా నిల‌చింది.

'ఆర్య‌' విడుద‌లైన‌ దాదాపు ప‌ద‌మూడేళ్ళ త‌రువాత మెగా కాంపౌండ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ర‌త్న‌వేలు.. వ‌రుసపెట్టి మెగా ఫ్యామిలీ చిత్రాలు చేయ‌డ‌మే కాకుండా... 'ఖైదీ నంబ‌ర్ 150', 'రంగ‌స్థ‌లం', 'సైరా' రూపంలో హ్యాట్రిక్ విజ‌యాలు అందుకోవ‌డం విశేషం. అంతేకాదు... టాలీవుడ్ కెరీర్‌లో ఇలా హ్యాట్రిక్ విజ‌యాలు చూడ‌డం ర‌త్న‌వేలుకి ఇదే తొలిసారి కావ‌డం మ‌రో విశేషం. అలాగే ఈ మూడు చిత్రాలు కూడా వ‌రుస సంవ‌త్స‌రాల్లో రిలీజైన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. మున్ముందు కూడా మెగా కాంపౌండ్ హీరోల‌తో ర‌త్న‌వేలు ఇదే శైలిని కొన‌సాగిస్తూ ఘ‌న‌విజ‌యాలు అందుకుంటాడేమో చూడాలి మ‌రి.

More News

డిసెంబ‌ర్‌లో సినిమా ఫెస్టివ‌ల్‌

తెలుగు చిత్ర ప‌రిశ‌మ్ర‌కు సంబంధించి 2019 డిసెంబ‌ర్ వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే.. ఏకంగా ప‌ది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్  ఈ నెల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

'చద‌రంగం' ఆడ‌బోతున్న నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌... ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.  `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌`,

ఫిల్మ్ సిటీలో మెగాస్టార్ కొత్త చిత్రం

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... తాజాగా హిస్టారిక‌ల్ డ్రామా `సైరా.. న‌ర‌సింహారెడ్డి`తో మ‌రో భారీ విజ‌యాన్ని అందుకున్నారు.

అల్లుడితో `వెంకీమామ‌` చిందులు

విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీమామ‌`.

`స‌రిలేరు నీకెవ్వ‌రు`... టీజ‌ర్ అప్‌డేట్‌

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` వంటి రెండు వ‌రుస విజ‌యాల త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నుంచి రానున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`.