close
Choose your channels

ద‌ర్శ‌కుడిగా మారుతున్న స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్

Sunday, September 15, 2019 • తెలుగు Comments

ద‌ర్శ‌కుడిగా మారుతున్న స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్

ఓ స‌న్నివేశాన్ని ఎలా చేయాలి, ఎలా తీయాల‌నేది ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌, ఉహ అయితే.. ఆయ‌న ఆలోచ‌న‌కు అనుగుణంగా ఆ స‌న్నివేశాన్ని ర‌క్తి కట్టించేది మాత్రం సినిమాటోగ్రాఫ‌ర్‌. ప్రేక్ష‌కులు బ్ర‌హ్మాండంగా భావించిన ఎన్నో స‌న్నివేశాల‌ను త‌న కెమెరాలో బంధించిన స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి కెమెరామెన్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి కెమెరామెన్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. చాలా మంది కెమెరామెన్స్ ద‌ర్శ‌కులుగా మారుతున్నారు.

మ‌రి ర‌త్న‌వేలు డైరెక్ట‌ర్‌గా మార‌లేదు ఎందుకు? అనే సందేహం రాక‌మాన‌దు. నిజానికి ర‌త్న‌వేలు 7-8 ఏళ్ల క్రిత‌మే ద‌ర్శ‌కుడిగా మారాల‌ని అనుకున్నాడ‌ట‌. కానీ ఆ స‌మ‌యంలో `రోబో`లో అవ‌కాశం రావ‌డంతో ఆలోచ‌న మానుకున్నాడు. మ‌ళ్లీ కెమెరామెన్‌గానే బిజీగా మారిపోయారు. `రంగ‌స్థ‌లం` స‌మ‌యంలో తన ద‌ర్శ‌క‌త్వ ఆలోచ‌న‌ను చ‌ర‌ణ్‌కు చెప్ప‌గానే, కెమెరామెన్‌గా టాప్‌లో ఉన్నారు. దీన్ని కంటిన్యూ చేయండి. త‌ర్వాత డైరెక్ష‌న్ చేసుకోవ‌చ్చు అని అన్నాడ‌ట‌. దాంతో మ‌ళ్లీ కొన్ని రోజుల పాటు ఆలోచ‌న వాయిదా ప‌డింది. అయితే ర‌త్న‌వేలు మాత్రం త‌న ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌నుకున్న క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడట‌. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడిగా మారబోతున్నాడ‌ట ర‌త్న‌వేలు.

సినిమాటోగ్రాఫ‌ర్‌గా హాలీవుడ్‌లో ఓ సినిమా చేయాల‌నేది ర‌త్న‌వేలు కోరిక‌ట‌. ఐదేళ్ల క్రితమే కెమెరామెన్‌గా ప‌నిచేసే అవ‌కాశం హాలీవుడ్‌లో వ‌చ్చినా ఇక్క‌డున్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా హాలీవుడ్‌లో సినిమా చేయ‌లేద‌ట‌. తెలుగు, త‌మిళ సినిమాల్లోనే ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిగా ఉంద‌ని అంటున్నారు ర‌త్న‌వేలు.

Get Breaking News Alerts From IndiaGlitz