ర‌విబాబు మ‌రో ప్రయోగం

  • IndiaGlitz, [Tuesday,January 01 2019]

ఒక ప‌క్క హార‌ర్‌, కామెడీ చిత్రాలు చేయ‌డంలో  ఆస‌క్తి చూపే ద‌ర్శ‌కుడు ర‌విబాబు. ఈయ‌న త‌న కొత్త సినిమా టైటిల్‌ను 'ఆవిరి' అని ప్ర‌క‌టిస్తూ దానికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు.

ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్‌పై ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాత‌గా రూపొందిస్తోన్న సినిమా ఇది. ఇటీవ‌ల ఆయ‌న ద‌ర్శ‌క నిర్మాణంలో వ‌చ్చిన అదుగో డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు త‌న‌కు మంచి పేరు తెచ్చిన హార‌ర్ జోన‌ర్‌లో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయారు. అందుకు సంబంధించిన లుక్లో ఓ అమ్మాయి గాజు సీసాలో డ్యాన్స్ చేస్తుంటే ఆ గాజు సీసా మూత‌ను గోర్లు ఉన్న చేయి తెరుస్తుండేలా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధింన వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు. 

More News

లోక‌సభ‌కు సై అంటున్న ప్రకాష్ రాజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కొత్త సంవ‌త్స‌ర వేడుక సంద‌ర్భంగా ఓ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. అదేంటంటే.. ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం

స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు 'త్రివిక్రమ్' ల కాంబినేషన్ లో  మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది.

నాన్న‌కు భ‌య‌ప‌డుతున్నజాన్వి

శ్రీ దేవి పెద్ద త‌న‌య జాన్వీక‌పూర్‌, ద‌ఢ‌క్ సినిమాతో స‌క్సెస్ అందుకుంది. ఈమెతో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నా.. జాన్వీక‌పూర్ మాత్రం సెల‌క్టివ్‌గానే సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది.

కాజ‌ల్ వివాదం పై ద‌ర్శ‌కుడి స్పంద‌న‌

బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్‌ను ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తున్నారు. అందులో త‌మిళ వెర్ష‌న్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది.

విశాల్‌కి నిశ్చితార్థం

త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన న‌టుడు విశాల్ న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ త‌ర్వాతే త‌న పెళ్లి అని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.